Begin typing your search above and press return to search.
మణిరత్నం 'నవరస' సిరీస్ నుంచి 9 ఫస్ట్ లుక్స్..!
By: Tupaki Desk | 8 July 2021 9:57 AM GMTలెజండరీ డైరెక్టర్ మణిరత్నం నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది విభాగాలతో ''నవరస'' అనే వెబ్ సిరీస్ రూపొంచే పనిని చేపట్టిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఇందులో హాస్యం - శృంగారం - భయానకం - కరుణ - రౌద్రం - కోపం - ధైర్యం - అద్భుతం - బీభత్సం లాంటి నవరసాల ఆధారంగా తొమ్మిది కథలను చెప్పబోతున్నారు. తొమ్మిది మంది దర్శకులు - తొమ్మిది కాన్సెప్టులు - తొమ్మిది భాగాలు - స్టార్ నటీనటులు కలిసి ఈ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో ఓ కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నారు.
మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం నిర్మిస్తున్న 'నవరస' ఆంథాలజీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ జయేంద్ర పంచపకేషన్ భాగస్వామిగా ఉన్నారు. దీని కోసం పాపులర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. సూర్య - విజయ్ సేతుపతి - బాబీ సింహా - ప్రకాష్ రాజ్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - నిత్యా మీనన్ - ఐశ్వర్య రాజేష్ - విక్రాంత్ - గౌతమ్ కార్తీక్ - శ్రీరామ్ - అశోక్ సెల్వన్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్ - సంతోష్ శివన్ - మనోజ్ పరమహంస - బాలసుబ్రహ్మనియన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ - డి. ఇమ్మాన్ - జిబ్రాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం సమకూరుస్తున్నారు.
'నవరస' లోని తొమ్మిది ఎపిసోడ్స్ కు ప్రియదర్శన్ - గౌతమ్ మీనన్ - వసంత్ - కార్తీక్ సుబ్బరాజ్ - అరవింద్ స్వామి - హాలితా సమీన్ - కార్తిక్ నరేన్ - బెయోజ్ నంబియార్ - ఆర్.ఆర్ ప్రసాద్ వంటి 9 మంది దర్శకులు పని చేస్తున్నారు. తమిళ్ లో రూపొందించిన ఈ సిరీస్ ను ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆంథాలజీ సిరీస్.. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'నవరస' నుంచి తొమ్మిది విభాగాలకు సంబంధించిన 9 ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు.
* 'గిటార్ కంబి మేలే నిండ్రు' అనే విభాగానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య - ప్రయాగా మార్టిన్ ప్రధాన పాత్రలు పోషించారు.
* 'పాయసం' అనే ఎపిసోడ్ కి వసంత దర్శకత్వం వహించారు. ఇందులో డిల్లీ గణేష్ - రోహిణి - అదితి బాలన్ - కార్తీక్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు
* 'సమ్మర్ ఆఫ్ 92' అనే విభాగానికి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ డైరెక్షన్ చేశారు. ఈ సిరీస్ లో కమెడియన్ యోగిబాబు - రమ్య నంబీసన్ ముఖ్య పాత్రలు పోషించారు.
* డైరెక్టర్ బెజోయ్ నంబియార్ 'ఎథిరి' అనే ఎపిసోడ్ ని రూపొందించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి -ప్రకాష్ రాజ్ - రేవతి మరియు అశోక్ సెల్వన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.
* 'శాంతి' విభాగానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాబీసింహా - గౌతమ్ వాసుదేవ్ మీనన్ - మాస్టర్ తరుణ్ కీ రోల్స్ ప్లే చేశారు.
* అరవింద్ స్వామి 'రౌద్రమ్' రసానికి దర్శకత్వం వహించారు. శ్రీరామ్ - రిత్విక - అభినయశ్రీ - రమేష్ తిలక్ - గీతా కైలాసం ఇందులో నటించారు.
* 'ప్రాజెక్ట్ అగ్ని' అనే ఎపిసోడ్ కు కార్తీక్ నరేన్ డైరెక్షన్ చేశారు. అరవింద్ స్వామి మరియు ప్రసన్న ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు చేశారు.
* ఆర్.రవీంద్ర ప్రసాద్ 'ఇన్మై' అనే విభాగాన్ని తెరకెక్కించారు. బొమ్మరిల్లు సిద్దార్థ్ - పార్వతి తిరువోర్తు ఇందులో పాత్రధారులు.
* 'తునింత పిన్' సిరీస్ ను హాలితా సమీన్ రూపొందించారు. అధర్వ మురళి - అంజలి మరియు కిషోర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.