Begin typing your search above and press return to search.
రెండు రోజుల్లో 9 సినిమాల దండయాత్ర
By: Tupaki Desk | 15 Jun 2022 12:58 PM GMTథియేటర్లు దొరికాయి కదా అని చిన్న సినిమాలు ఎడాపెడా రిలీజ్ డేట్ లు ఇచ్చేస్తున్నాయి. సినిమాపై నమ్మకం వుంటే పర్లేదు కానీ ఇక్కడ అతినమ్మకమే ఇబ్బందికరంగా మారుతోంది. స్టార్ సినిమా బాగా లేదనే టాక్ వినిపిస్తేనే ఆడియన్స్ థియేటర్లకు కిలోమీటర్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక చిన్న సినిమా అంటే కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. ఇలాంటి సమయంలో బంచ్ లు బంచ్ లుగా పోటీపడుతూ రెండు రోజుల్లో చిన్న సినిమాలు 9 పోటాపోటీగా థియేటర్లలో దండయాత్రకు రెడీ అవుతున్నాయి.
జూన్ 17న రానా, సాయి పల్లవి నటించిన `విరాటపర్వం`, సత్యదేవ్ నటించిన `గాడ్సే` సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో రానా, సాయి పల్లవి మూవీపైనే బజ్ ఎక్కువగా వుంది. ఈ సినిమాలు విడుదలైన వారం గ్యాప్ లో మొత్తం 9 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో ఒకటి 23న వస్తుండగా.. మిగతా ఎనిమిది చిత్రాలు 24న విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ లని కూడా ప్రకటించేశాయి కూడా.
ఇందులో ముందుగా జూన్ 23న అత్యంత వివాదాస్పద మూవీ `కొండా` విడుదల కాబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. వరంగల్ జిల్లాలో పేరు మోసిన దంపతులు కొండా మురళి, కొండా సురేఖల కథగా ఈ మూవీని రూపొందించారు. దీనిపై పెద్దగా బజ్ ఏమీ లేదు. ఇక 24న మొత్తం ఎనిమిది చిత్రాలు పోటీపడుతున్నాయి. ఇందులో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన `సమ్మతమే` మూవీపై ఫరవాలేదనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఇదే రోజున ఆకాష్ పూరి, దళం, జార్జిరెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన `చోర్ బజార్` రిలజ్ అవుతోంది. ఇది ముందు అనుకున్న డేట్ కాదు.. అప్పటి కప్పుడు రిలీజ్ డేట్ ని ప్రకటించి గుంపులోకి దించేశారు.
ఇక `డర్టీహరి` తరువాత ఎం.ఎస్. రెడ్డి రూపొందించిన `7 డేస్ 6 నైట్స్` రిలీజ్ అవుతోంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించారు. ఇక ఇదే బాటలో సాయి రాంశంకర్ నటించిన `పథకం ప్రకారం` మూవీ రిలీజ్ అవుతోంది. చాలా రోజుల తరువాత సాయి రాం శంకర్ నుంచి వస్తున్న సినిమా ఇది.
ఎలాంటి ముందస్తు ప్లాన్ లేకుండానే థియేటర్లు లభిస్తున్నాయని సడన్ గా రిలీజ్ ప్రకటించారు. వీటి తరహాలోనే `గ్యాంగ్ స్టర్ గంగరాజు, టెన్త్ క్లాస్ డైరీస్, షికారు, సదా నన్ను నడిపే .. వంటి చిత్రాలు 24నే క్యూ కడుతున్నాయి. ఈ 9 సినిమాల్లో దేనికీ పెద్దగా బజ్ లేదు. ఈ నేపథ్యంలో విడుదల కానున్న ఈ మూవీస్ లో ఏది గట్టెక్కుతుందో తెలియాలంటే జూన్ 24 వరకు వేచి చూడాల్సిందే.