Begin typing your search above and press return to search.
సాహో యాక్షన్.. పెంచుతూ పోతుున్నారు
By: Tupaki Desk | 3 May 2018 6:20 AM GMT‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఈ చిత్రం ‘బాహుబలి’ తొలి భాగం విడుదల కావడానికి ముందే ఓకే అయింది. ఐతే ‘బాహుబలి’ రెండు భాగాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజై అసాధారణ ఫలితాలందుకునేసరికి.. నెమ్మదిగా ‘సాహో’ రేంజ్ పెరిగిపోయింది. ముందు ఓ మోస్తరు బడ్జెట్లో చేయాలనుకున్న సినిమాను ఆ తర్వాత భారీ ఖర్చుతో లావిష్ గా తీయడానికి ఫిక్సయ్యారు. ప్రభాస్ మార్కెట్ అలా పెరిగిపోయింది మరి. మూడు భాషల్లో తీయబోయే సినిమా.. నేషనల్ వైడ్ భారీ రిలీజ్ కు ఛాన్సుండటంతో సినిమా రేంజ్ మారింది. ఈ చిత్రంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసమే రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయబోతున్నట్లు ఇంతకుముందు వార్తలొస్తే ఔరా అనుకున్నాం. కానీ ఆ ఎపిసోడ్ కు ఖర్చు చేసే ఫిగర్ అంతకంతకూ పెరిగిపోతోంది.
మధ్యలో రూ.75 కోట్లన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసమే రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాతలే పీలర్స్ వదిలారు. ఇండియాలో రూ.90 కోట్లు ఒక సినిమాకు ఖర్చు చేస్తేనే దాన్ని భారీ బడ్జెట్ అంటున్నాం. పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు ఆ రేంజ్ బడ్జెట్లోనే తెరకెక్కుతున్నాయి. అలాంటిది ఒక యాక్షన్ బ్లాక్ కోసం అంత ఖర్చు చేయడమంటే విడ్డూరంగానే ఉంది. ఎంత ప్రభాస్ రేంజ్ పెరిగినా మరీ ఈ స్థాయిలో ఖర్చు చేయాలా.. ఇది టూమచ్ కాదా అన్న చర్చ జరుగుతోంది. మరి అంతగా ఖర్చు చేసిన ఎపిసోడ్ ఎంత గొప్పగా వస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ చిత్రీకరణ కోసమే ‘సాహో’ టీం దుబాయిలో ఉన్న సంగతి తెలిసిందే.