Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: 96 రీమేక్ కు వార్నింగ్ బెల్
By: Tupaki Desk | 17 April 2019 10:34 AM GMTమనదగ్గర షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యమయ్యింది కానీ శాండల్ వుడ్ లో చాలా ఫాస్ట్ గా 96 రీమేక్ 99గా పేరు మార్చి విడుదలకు రెడీ చేశారు. తమిళ్ లో గత ఏడాది రిలీజై క్లాసిక్ స్టేటస్ తో పాటు కమర్షియల్ గా కూడా గొప్ప విజయాన్ని అందుకున్న 96 కోసం వివిధ బాషల నుంచి హక్కుల కోసం డిమాండ్ ఏర్పడగా తెలుగులో దిల్ రాజు కొని ఇటీవలే శర్వానంద్ సమంతా జంటగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
కన్నడలో గోల్డెన్ స్టార్ గా పిలువబడే గణేష్ హీరోగా శ్రీకాంత్ మహాత్మలో నటించిన భావన హీరొయిన్ గా తీసిన 99 ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు. దీని ట్రైలర్ ఇటీవలే ఆన్ లైన్ లోకి వచ్చింది. చూడగానే ప్రేక్షకుల నుంచి మిక్స్ద రియాక్షన్స్ వచ్చేశాయి. ఒరిజినల్ స్థాయిలో లేదంటూ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ లో వచ్చే ఆర్టిస్టుల విషయంలో జాగ్రత్త వహించి ఉండాల్సిందంటు రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి
విజయ్ సేతుపతి త్రిషల మధ్య తమిళ్ వెర్షన్ లో పండిన కెమిస్ట్రీ అంతగా గణేష్ భావనల మధ్య రాలేదని ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్. రెండున్నర నిమిషాల ట్రైలర్ లోనే ఇన్నేసి పసిగట్టారు అంటే రేపు సినిమా మొత్తం వచ్చాక ట్రాలింగ్ కు దిగినా ఆశ్చర్యం లేదు. గతంలో ప్రేమమ్ తెలుగు రీమేక్ లో శృతి హాసన్ వేసిన పాత్ర గురించి కూడా ఇలాంటి కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి.
సో కన్నడ వెర్షన్ మనవాళ్ళకు ఓ వార్నింగ్ బెల్ లా ఉపయోగపడవచ్చు. కాకపోతే కన్నడలో దర్శకత్వం వహించింది ప్రీతం గుబ్బి. కథలోని ఆత్మను పసిగట్టలేకపోయుండొచ్చు. కానీ తెలుగు వెర్షన్ టేకప్ చేసింది 96 తీసిన ప్రేమ్ కాబట్టి ఫీల్ మిస్ కాకపోవచ్చు . చూద్దాం