Begin typing your search above and press return to search.

ఫుల్ స్పీడ్ మీదున్న శాండల్ వుడ్ 96

By:  Tupaki Desk   |   28 Feb 2019 8:58 AM GMT
ఫుల్ స్పీడ్ మీదున్న శాండల్ వుడ్ 96
X
గత ఏడాది తమిళ్ లో క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 96 తెలుగు రీమేక్ కోసం ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే . ఒరిజినల్ వెర్షన్ విడుదలకు ముందే హక్కులు కొన్ని దిల్ రాజు సెట్స్ పైకి తీసుకెళ్ళడంలో ఆలస్యం చేస్తున్నారు. శర్వానంద్ ఒకపక్క సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న షూటింగ్ లో బిజీగా ఉండగా మరోపక్క సమంతా మజిలి ఫినిషింగ్ తో పాటు నందిని రెడ్డి తీస్తున్న మూవీలో కూడా పాల్గొంటోంది.

మార్చ్ నుంచి స్టార్ట్ అన్నారు కాని దర్శకుడు ప్రేమ్ మార్పులను ఇంకా ఒక కొలిక్కి తీసుకురాలేదని ఇన్ సైడ్ టాక్. విజయ్ సేతుపతి-త్రిషల మధ్య నడిచిన కెమిస్ట్రీని తమిళ్ లో చూసే మనవాళ్ళు ఫిదా అయ్యారు. అలాంటిది తెలుగులో వస్తే ఇంకా ఏ రేంజ్ కు వెళ్తుందో అన్న అంచనాలో దిల్ రాజు దీని మీద గట్టి అంచనాలు పెట్టుకున్నారు

ఈ లెక్కలు ఆశల సంగతి ఇలా ఉండగా పక్కనే ఉన్న శాండల్ వుడ్ లో మాత్రం 96 రీమేక్ షూట్ చకచకా జరిగిపోతోంది. అక్కడ గోల్డెన్ స్టార్ గా పేరున్న గణేష్ హీరోగా మహాత్మలో శ్రీకాంత్ సరసన నటించి ఆ తర్వాత కన్నడలో సెటిలైన భావన హీరొయిన్ గా ఇది రూపొందుతోంది. ఇప్పటికే కీలక భాగం షూట్ చేసారు. వీటి తాలుకు ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ప్రీతం గుబ్బి దర్శకత్వం వహిస్తున్న 96 కన్నడ టైటిల్ లో మార్పు ఉండకపోవచ్చని తెలిసింది. సో ఇది చూస్తే మనమే వెనుకబడి నట్టు అర్థమవుతోంది. 96 పైకి సింపుల్ లవ్ స్టొరీగా అనిపించినా అందులో అద్బుతమైన ఫీల్ తో పాటు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మనకన్నా కన్నడ ప్రేక్షకులే త్వరగా చూడబోతున్నారన్న మాట.