Begin typing your search above and press return to search.
టీవీల్లో వచ్చినా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్
By: Tupaki Desk | 11 Nov 2018 1:30 AM GMTఈ మద్య కాలంలో శాటిలైట్ రైట్స్ రేట్లు బాగా పెరిగి పోయాయి. రేట్లు పెరిగాయి కనుక సినిమా వేడిగా ఉన్నప్పుడే టీవీల్లో కూడా ప్రసారం చేసుకునేందుకు నిర్మాతల వద్ద అనుమతలు తీసుకుంటున్నారు. అంటే సినిమా సక్సెస్ అయితే రెండు నెలల తర్వాత ఫ్లాప్ అయితే నెల రోజుల తర్వాత టీవీల్లో వేసుకునేలా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే తమిళంలో విడుదలైన ‘96’ చిత్రాన్ని సన్ టీవీ పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేసింది. నెల రోజుల్లో టీవీల్లో వేసుకునేలా ఒప్పందం చేసుకుంది.
‘96’ చిత్రం సూపర్ హిట్ దక్కించుకుంది. అన్ని ఏరియాల్లో కూడా నాలుగు వారాలు దాటిన తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటి సమయంలో దీపావళి కానుకగా సన్ టీవీలో 96 చిత్రాన్ని ప్రదర్శించేందుకు సిద్దం అయ్యారు. ఆ సమయంలో పలువురు సన్ టీవీలో 96 ప్రీమియర్ ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఉద్యమంలా బ్యాన్ అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో సన్ టీవీ ప్రీమియర్ ను వాయిదా వేస్తుందని అంతా భావించారు. కాని ముందుగానే ప్రకటించినట్లుగా దీపావళికి ప్రీమియర్ వేశారు.
సన్ టీవీలో సినిమా వచ్చినా కూడా ఇంకా థియేటర్లలో మంచి షేర్ ను దక్కించుకుంటుందట. తాజా వీకెండ్ లో సినిమా కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. టీవీలో వచ్చినా కూడా సినిమా సక్సెస్ అయ్యింది కనుక కలెక్షన్స్ వస్తున్నాయి. మంచి సినిమాను ఎలా తొక్కేయాలన్నా, ఎంత పైరసీ వచ్చినా కూడా ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలనుకుంటారు అనేందుకు ఇది మరో సాక్ష్యం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.