Begin typing your search above and press return to search.
96 తెలుగు టైటిల్ ఫిక్స్ అయ్యిందా ?
By: Tupaki Desk | 6 March 2019 7:33 AM GMTగత ఏడాది తమిళ్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ తో పాటు సూపర్బ్ కమర్షియల్ సక్సెస్ అందుకున్న 96 తెలుగు రీమేక్ కు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇంకా షూటింగ్ ప్రారంభం కానప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో స్క్రిప్ట్ వర్క్ అయితే శరవేగంగా జరుగుతోంది. శర్వానంద్ సమంతాలు వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న కారణంగా కొంత ఆలస్యం అవుతున్నా ఒకసారి మొదలుపెట్టాక వీలైనంత త్వరగా పూర్తి చేసేలా దర్శకుడు ప్రేమ కుమార్ నిర్మాత దిల్ రాజులు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం.
ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం దీనికి టైటిల్ విషయంలో టీం సభ్యులు ఒక అభిప్రాయానికి వచ్చారట. దాని ప్రకారం 96 తెలుగు వెర్షన్ కు జాను టైటిల్ అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇది అఫీషియల్ అప్ డేట్ కాదు. జాను అని ఫిక్స్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే హీరొయిన్ పాత్ర పేరు జానకి. అందరూ జానూ అని పిలుస్తూ ఉంటారు. హీరోకు ఆ పేరుతో చాలా బలమైన ఎమోషన్ ఉంటుంది.
కథ కూడా ఎలాగూ ఆ పాత్ర మీదే ఎక్కువగా ఫోకస్ అవుతుంది కాబట్టి ఇదే సూటవుతుందని అనుకుంటున్నారట. అయితే శర్వానంద్ సమంతాలతో ఓసారి డిస్కస్ చేసి ఫైనల్ చేస్తారని తెలిసింది. ఒరిజినల్ వెర్షన్ కు మ్యూజిక్ అందించిన గోవింద వసంత ప్రస్తుతం ట్యూన్స్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఒకపక్క కన్నడలో గణేష్-భావనలతో దీని రీమేక్ ఫాస్ట్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. మనదగ్గరే కొంత ఆలస్యం అవుతోంది