Begin typing your search above and press return to search.

స్టార్ హీరో తాగొచ్చి డోర్ కొట్టాడు…నటి కామెంట్స్ వైరల్

By:  Tupaki Desk   |   21 March 2023 6:00 AM
స్టార్ హీరో తాగొచ్చి డోర్ కొట్టాడు…నటి కామెంట్స్ వైరల్
X
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులకి సంబందించిన ఘటనలు ఎంత సంచలనంగా మారాయో అందరికి తెలిసిందే. ఇక కాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరిగే వేధింపులపై ఎంతో మంది గళం విప్పారు. పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ మీటూ పేరుతో జరిగిన ఉద్యమం తర్వాత ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు చాలా వరకు తగ్గాయని చెప్పాలి.

అయితే కొంత మంది తారలు మాత్రం నచ్చి వెళ్తే తప్పు లేదని, అలా అని బలవంతం చేసే రైట్స్ ఎవరికి లేవని ఈ మధ్యకాలంలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇండస్టీలో వేధింపులు అనేవి ఇప్పుడు మాత్రమే కాదని, దశాబ్దాల కాలం నుంచి ఉన్నాయని కొంత మంది సీనియర్ హీరోయిన్స్ ఇంటర్వ్యూలు విన్నప్పుడు తెలుస్తుంది. తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, జయం మనదేరా, భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దము రారండి,కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా సినిమాలో నటించిన సీనియర్ నటి వెన్నెరాడై నిర్మల.

ఈమె కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. అలాగే అప్పటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న ఈమె ఓ యుట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. ఓ సినిమా చేసే సమయంలో ఓ పెద్ద హీరో షూటింగ్ అయిపోయిన తర్వాత తాగి నా ఇంటికి వచ్చాడు. డోర్ కొడుతూనే ఉన్నాడు. తలుపు తియ్యమని చాలా సేపు అడిగాడు.

నేను మిమ్మల్ని ఏమీ చేయనని, మీ పక్కన పడుకొని వెళ్ళిపోతా అంటూ మాట్లాడారు. నాకు భయం వేసి డోర్స్ తీయలేదు. చాలా సేపు ఉన్న తర్వాత అతను తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత ఆ సినిమా నుంచి నేను తప్పుకున్న. దర్శకుడు, నిర్మాత వచ్చి నన్ను బ్రతిమలాడారు. అయిన కూడా చేయనని చెప్పేసాను. ఆ సంఘటన తనని చాలా కలచివేసింది అని నిర్మల పేర్కొన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది తను చెప్పలేనని తేల్చేసింది. ఇప్పుడు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.