Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో వీలు పడలేదు కానీ ముంబైలో కొనేసిందట
By: Tupaki Desk | 24 March 2023 8:00 AMతెలుగు లో నివేదా పేతురాజ్ చాలా సినిమాల్లో నటించింది. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది కానీ స్టార్ హీరోలకు జోడీగా మాత్రం అవకాశాలు దక్కలేదు. సినిమాలు సిరీస్ లతో బాగానే సంపాదించిన నివేదా పేతురాజ్ ముంబైకి మకాం మార్చబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా పేర్కొంది. అంతే కాకుండా అక్కడ (ముంబై) లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లుగా పేర్కొంది. త్వరలోనే ముంబై కి మకాం మార్చబోతున్నట్లుగా కూడా పేర్కొంది. హీరోయిన్ గా తెలుగు లో ఇటీవలే ఈమె దాస్ కా దమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
చిన్న సినిమాలు.. సిరీస్ ల వల్ల పెద్దగా ఈ అమ్మడికి క్రేజ్ దక్కడం లేదు. అయినా కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నివేదా పేతు రాజ్ ఎక్కువ భాషల్లో నటించింది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు.. సిరీస్ లు నటించిన ఘనత దక్కించుకుంది.
హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ప్రయత్నాలు చేసినా కూడా వీలు పడలేదని.. కానీ ముంబైలో ఇల్లు కొనేసినట్లుగా చెప్పుకొచ్చింది. హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేయలేక పోవడానికి కారణం ఏంటీ అనేది చెప్పలేదు. ముంబై లో ఇల్లు కు సంబంధించిన మరిన్ని విషయాలు భవిష్యత్తులో చెప్తానంటూ పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.