Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ 2వ ట్రైలర్: రావణుడి పై శ్రీరాము ని పోరు ఒక విజువల్ ఫీస్ట్
By: Tupaki Desk | 7 Jun 2023 3:03 AM ISTబాహుబలి- ఆర్.ఆర్.ఆర్ తర్వాత ప్రజలు మరో విజువల్ ఫీస్ట్ ని చూడాలని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అయితే అది ఆదిపురుష్ 3డి తో సాధ్యమవుతుందా? అంటూ ఇంతకాలం నెటిజనుల్లో ఆసక్తికర చర్చ సాగింది. బాహుబలి- సాహో లాంటి భారీ చిత్రాల్లో నటించిన ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే అది అసాధారణంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోరుకుంటారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లోని అభిమానులు కూడా ప్రభాస్ ని మరో లెవల్లో చూడాలని వేచి చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో వస్తున్న ఆదిపురుష్ 3డి రామాయణ కథతో శ్రీరాముని ఔన్నత్య కథతో తెరకెక్కించడంతో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదినా ఈ సినిమా పై ఎంతో ఆసక్తి నెలకొంది. టీజర్ తో నిరాశపరిచినా మొదటి ట్రైలర్ తో ఓంరౌత్ సాంకేతికంగా ప్రతిదీ సరి చేసుకున్నాడ ని ప్రశంసలొచ్చాయి. ఈరోజు తిరుపతిలో జరిగిన ప్రీరిలీజ్ వేడుక లో ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం లంకేయుడైన రావణుడి పై కి శ్రీరాము ని సైన్యం దండయాత్రకు వెళుతున్న తీరు ను ఆవిష్కరించారు. ముఖ్యంగా లంకేశుని చూపించే ఫ్రేమ్ లో రాఘవుని కంటే పదింతలు శక్తివంతుడి గా రావణుడి ని ఆవిష్కరించేందుకు వీఎఫ్ ఎక్స్ వర్క్ ఎంతో భారీ గా ఉపయోగించారని అర్థమవుతోంది. ఇక ఆంజనేయుడు వానరసైన్యం యుద్ధానికి బయల్దేరే ఘట్టాల కోసం భారీ విజువల్ గ్రాఫిక్స్ ని ఉపయోగించారు.
టీజర్ లో కంటే సైఫ్ అలీఖాన్ ట్రైలర్ లో ఎంతో గంభీరంగా కనిపించాడు. ట్రైలర్ ఆరంభమే మాయావి రూపంలో వచ్చి సీత ను ఎత్తుకెళుతున్న వైనం ఎమోషన్ ని రగిలించింది. ఆ తర్వాత సీత ను అపహరించిన రావణుడి పైకి వానరసైన్యం సాయంతో దండయాత్ర కు బయల్దేరిన శ్రీరాముని కథ ను ట్రైలర్ లో ఆవిష్కరించారు. ఈ యుద్ధం చెడు పై మంచి సాగించే పోరు. అధర్మంపై ధర్మం పోరు. వీటన్నిటినీ సంభాషణలు విజువల్స్ రూపంలో ట్రైలర్ లో ఆవిష్కరించారు. జానకి ని తిరిగి తీసుకురావడానికి లంకేష్ తో పోరాడటానికి రాఘవ్ వానరసేన సాహసాల కోసం భారీ విజువల్ గ్రాఫిక్స్ ని ఉపయోగంచారని ట్రైలర్ చెబుతోంది. ఆదిపురుష్ ట్రైలర్ ట్రీట్ మరింత ఆసక్తిని పెంచింది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ రామాయణం పౌరాణిక కథ కు అనుసరణ. ప్రభాస్ రాఘవగా-జానకి పాత్రలో కృతి- లంకేష్ గా సైఫ్ -లక్ష్మణ్ గా సన్నీ సింగ్ - భజరంగ్ గా దేవదత్తా నాగే నటించారు. ఆదిపురుష్ మొదట 11 ఆగస్టు 2022న సినిమా హాళ్లలోకి రావాల్సి ఉన్నా విడుదల తేదీని 12 జనవరి 2023కి వాయిదా వేశారు. కానీ చివరికి 16 జూన్ 2023న అన్ని రకాలా బెటర్ మెంట్ చేసిన విజువల్స్ తో 3డి లో తెర పైకి రానుంది. న్యూయార్క్ లో జూన్ 7-18 వర కు జరిగే ట్రిబెకా ఫెస్టివల్ లో 13వ తేదీన ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ ను ప్రదర్శించనుండడం ఆసక్తికరం. అంటే భారత్ లో విడుదల కు ముందే ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్ ను మూడు రోజుల ముందే ప్రదర్శించనున్నారు.