Begin typing your search above and press return to search.

లెజెండ్ బయోపిక్ కి ఆమెను మించి మరెవ్వరు దొరకలేదా?

By:  Tupaki Desk   |   30 May 2023 1:00 PM GMT
లెజెండ్ బయోపిక్ కి ఆమెను మించి మరెవ్వరు దొరకలేదా?
X
భారత క్రికెట్‌ కు ఈ స్థాయిని తీసు కు వచ్చిన వారిలో సౌరవ్ గంగూలీ ఒకరు అనడంలో సందేహం లేదు. కెప్టెన్ గా గంగూలీ సాధించిన విజయాలు ఇండియన్ క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికి నిలిచి ఉంటాయి అనడంలో సందేహం లేదు. అలాంటి లెజెండ్‌ గంగూలీ యొక్క బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే సచిన్‌.. ధోనీ తో పాటు పలువురు స్టార్‌ క్రికెటర్స్ యొక్క బయోపిక్ లు వచ్చాయి. ధోనీ బయోపిక్‌ కమర్షియల్‌ గా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఇప్పుడు అదే స్థాయిలో సౌరవ్‌ గంగూలీ యొక్క బయోపిక్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసు కు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్ర లో లువ్ రంజన్‌ ఫిలిమ్స్ బ్యానర్‌ లో ఈ భారీ బయోపిక్ ను నిర్మించబోతున్నారు. ఇప్పటికే సౌరవ్ గంగూలీ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాతలు సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతల ను సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజినీకాంత్‌ కు ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు.

తమిళంలో పలు సినిమాల ను రూపొందించిన ఐశ్వర్య రజినీకాంత్‌ ఇప్పటి వరకు మంచి కమర్షియల్‌ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయింది. దర్శకురాలిగా ఐశ్వర్య రజినీకాంత్‌ పదేళ్లుగా కొనసాగుతున్నా కూడా ఒక్క సినిమాతో కూడా కమర్షియల్ గా బిగ్‌ సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.

అలాంటి దర్శకురాలికి ఎలా లెజెండ్‌ సౌరవ్ గంగూలీ యొక్క బయోపిక్‌ యొక్క దర్శకత్వ బాధ్యతను అప్పగిస్తారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక బిగ్‌ కమర్షియల్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌ లేదా సౌత్‌ డైరెక్టర్ కి దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాల ని... లేదంటే గంగూలీ యొక్క బయోపిక్ ను తీయడమే ఆపేయాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. మరి నిర్మాతలు ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా అనేది చూడాలి.