Begin typing your search above and press return to search.

బ్ల‌డీ స్వీట్ LEO ఫ్యాన్ మేడ్ 3D ట్రైలర్

By:  Tupaki Desk   |   22 Jun 2023 10:35 PM GMT
బ్ల‌డీ స్వీట్ LEO ఫ్యాన్ మేడ్ 3D ట్రైలర్
X
ద‌ళప‌తి విజ‌య్ తో విక్ర‌మ్ ఫేం లోకేష్ క‌న‌గ‌రాజ్ 'లియో' లాంటి భారీ యాక్ష‌న్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు అన‌గానే ఈ సినిమాపై అంచ‌నాలు తారా స్థాయిని తాకాయి. ఇద్ద‌రు దిగ్గ‌జాల క‌ల‌యిక‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. లియో ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ఇంత‌కుముందే విడుద‌లై అభిమానుల్లోకి దూసుకెళ్లింది.

అదంతా అటుంచితే ఇంకా టీజ‌ర్ అయినా రాకుండానే అప్పుడే ట్రైల‌ర్ ని త‌యారు చేసి రిలీజ్ చేసేశాడు ఓ వీరాభిమాని. అత‌డి పేరు మ్యాడీ మాధ‌వ్. ఇంత‌కీ అత‌డు రూపొందించిన ట్రైల‌ర్ ప్ర‌త్యేక‌త ఏమిటి? అంటే ఇది 3డిలో రూపొందించిన యానిమేటెడ్ ఊహాత్మ‌క ట్రైల‌ర్.

నిజానికి లోకేష్ క‌న‌గ‌రాజ్ సైతం ఇలాంటిది ముందే ఊహించ‌లేడు! అంత గొప్ప‌గా ఈ ట్రైల‌ర్ ని రూపొందించాడు స‌ద‌రు అభిమాని. సాంకేతికంగా ఇది హాలీవుడ్ స్థాయికి త‌గ్గ‌ని రీతిలో ఎంతో అద్భుతంగా ఉందంటే అతిశ‌యోక్తి కాదు.

ఇంత‌కీ ట్రైల‌ర్ లో ఏం ఉంది? అంటే.. అల్ట్రా రిచ్ మ్యాన్ అయిన హీరో రోల్స్ రాయిస్ కార్ ని వెంబ‌డిస్తూ బాస్ లేడీ లాంటి ఒక అంద‌మైన అమ్మాయి త‌న ప‌డ‌వ లాంటి కార్ లో త‌రుముతుంటుంది. అయితే ఖ‌రీదైన క‌స్ట‌మైజ్డ్ కార్ల‌లో ఆ ఇరువురి న‌డుమా ఛేజ్ లు ఎంతో ఆక‌ట్టుకుంటుండ‌గానే .. క‌స్ట‌మైజ్డ్ లాక‌ర్ నుంచి గ‌న్ తీసి పేలుస్తాడు విజ‌య్.

అది త‌న లేడీ విల‌న్ స‌హ‌చ‌రుడి త‌ల నుంచి దూసుకుపోతుంది. ఆ త‌ర్వాత విజ‌య్ కార్ ని విల‌న్ల కార్లు చుట్టుముడ‌తాయి. అయితే విశాల‌మైన మైదానం లాంటి ఆ ప్లేస్ లో కార్ ని ఆపి స్టైలిష్ గా దిగిన విజయ్ కార్ వెలుప‌ల నుంచి క‌స్ట‌మైజ్డ్ నైఫ్ ని స్టైలిష్ గా భుజానికెత్తుకుని శ‌త్రువు గుండెల్లో ఒణుకు పుట్టిస్తాడు. ఈ మొత్తం థీమ్ ని విజువ‌ల్ గా ట్రీట్ చేసిన విధానం 3డి యానిమేష‌న్ లో రూపొందించిన విధానం ఎంతో అద్భుతం.

విజ‌య్ ని అల్ట్రా రిచ్ మ్యాన్ లా ఎంతో స్టైలిష్ గా చూపించ‌డ‌మే కాదు... అత‌డి ప్ర‌తి ఆహార్యాన్ని ఎక్క‌డా మిస్ కాకుండా ఎంతో జాగ్ర‌త్త తీసుకుని ఈ ట్రైల‌ర్ ని రూపొందించారు. స్లోమోష‌న్ షాట్స్ మైండ్ బ్లోయింగ్.

నిజానికి లియో ఒరిజిన‌ల్ ట్రైల‌ర్ వ‌స్తే ఇంత‌గా ఆక‌ట్టుకుంటుందో లేదో తెలీదు కానీ ఈ ట్రైల‌ర్ మాత్రం మైండ్ బ్లాంక్ చేస్తోంది. విజ‌య్ అభిమానుల‌నే కాదు కామ‌న్ ఆడియెన్ ఎవ‌రినైనా ఇది ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లోకి ఈ ట్రైల‌ర్ దూసుకెళ్లింది.

ఇటు టాలీవుడ్ స‌ర్కిల్స్ లోను వైర‌ల్ అయింది. దీంతో ఈ ట్రైల‌ర్ రూపొందించిన టెక్నీషియ‌న్ ఎవ‌రు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయని తెలిసింది. 3 నిమిషాల 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేయ‌గా 24 గంటల్లోనే 8 మిలియన్ల వీక్షణలు ల‌క్ష‌న్న‌ర లైక్ లు 40వేల‌ రీట్వీట్ లను సంపాదించింది. ఈ వీడియో మనోజ్ పరమహంస- అశ్విన్ రామ్- మణికందన్- వెంకట్ ప్రభు వంటి ప్ర‌ముఖుల‌ను ఆక‌ట్టుకుంది.