Begin typing your search above and press return to search.
చిరంజీవి కొత్త సినిమా స్టోరీ, టైటిల్ లీక్
By: Tupaki Desk | 14 Jun 2023 5:20 PMచాలా కాలం వరకూ ఆలస్యంగా సినిమాలు చేసుకుంటూ వచ్చినా.. రీఎంట్రీలో రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. 'ఖైదీ నెంబర్ 150' నుంచి ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో గత సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే చిరు వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తి అయిపోయింది. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసి.. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి.. కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమాను ఓకే చేశారని ఎప్పుడో ఓ న్యూస్ లీకైంది.
కల్యాణ్ కృష్ణతో పాటు మెగాస్టార్ చిరంజీవి మరో దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అతడు ఎవరో కాదు.. నందమూరి కల్యాణ్ రామ్‌కు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన మల్లిడి వశిష్ట అని తెలిసింది. ఈ టాలెంటెడ్ డైరెక్టరే ఇప్పుడు చిరంజీవి కోసం ఓ సోషియో ఫాంటసీ స్టోరీని రాశాడని అంటున్నారు. ఈ మూవీ ప్రకటన త్వరలోనే వస్తుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇక, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా.. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మాదిరిగా ఉండబోతుందని తెలిసింది. అంతేకాదు, మానవుడైన హీరో మూడు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడట. ఆయా లోకాల్లో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
హీరో పాత్ర మూడు లోకాలను చుట్టి వచ్చేలా డిజైన్ చేయబట్లే ఈ చిత్రానికి 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ టైటిల్‌ను ఇప్పటికే ఫిలిం చాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించారట. అంతేకాదు, ఈ మూవీలో చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతోన్నాయి.