Begin typing your search above and press return to search.

చైతూ లాంటి వాడిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది

By:  Tupaki Desk   |   4 April 2023 8:00 AM GMT
చైతూ లాంటి వాడిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది
X
దక్షా నాగర్కర్ పేరు చెప్పిన వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ ఆ మధ్య బంగార్రాజు సినిమా వేడుకలో నాగ చైతన్య చూసిన సమయంలో ఈమె కంటి చూపుతో సైగ చేసిన వీడియో వైరల్‌ అయింది. దాంతో దక్షా నాగర్కర్ గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది.

నాగ చైతన్య మరియు దక్షా మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందనే వార్తలు కూడా వచ్చాయి. సమంత తో విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన వెంటనే ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. తాజాగా ఆ విషయమై దక్షా నాగర్కర్ స్పందించింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతూ లాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయి అయినా కోరుకుంటుంది. అతడి వంటి సింపుల్ అబ్బాయిని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది అనడంలో సందేహం లేదు. అతడు అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అమ్మాయిలకు చాలా గౌరవాన్ని ఇస్తాడంటూ దక్షా పేర్కొంది.

బంగార్రాజు సినిమా షూటింగ్‌ సమయంలో నాతో కౌగిలింత సన్నివేశాలు.. ముద్దు సన్నివేశాలు చేస్తూ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ సన్నివేశాల చిత్రీకరణ తర్వాత సారీ చెప్పేవాడు అంటూ నాగ చైతన్య గురించి చెప్పుకొచ్చింది. బంగార్రాజు వేడుక సందర్భంగా కన్ను సైగ గురించి మాత్రం ప్రస్తుతానికి ఏం చెప్పను అన్నట్లుగా టాపిక్ ను మార్చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.