Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కి హైట్ స‌మ‌స్య‌?

By:  Tupaki Desk   |   25 March 2023 8:00 AM GMT
ఆ హీరోయిన్ కి హైట్ స‌మ‌స్య‌?
X
టాలీవుడ్ లో భారీ హైట్ ఉన్న హీరోలెంత మంది? అంటే కొంత‌మందే క‌నిపిస్తారు. ఉత్త‌రాది హీరోల్లా తెలుగు హీరోలంతా భారీ హైట్ అయితే కాదు. మ‌హేష్‌...ప్ర‌భాస్..రానా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి కొంద‌రున్నారు. బాల‌కృష్ణ‌..చిరంజీవి..వెంక‌టేష్‌..నాగార్జున త‌రం హీరోల్ని ప‌క్క‌న‌బెడితే! మిగ‌తా వారంతా ఈ హీరోల ఎత్తుకైతే స‌రితూగ‌రు. అందుకే టాలీవుడ్ మేక‌ర్స్ హీరోయిన్ ఎంపిక విష‌యంలో స్టార్ డ‌మ్ ఒక్క‌టే కాకుంటా..ఎత్తు బ‌రువులు వంటి విష‌యాలు కూడా లెక్క‌లోకి తీసుకుంటారు.

ఏ హీరో స‌ర‌స‌న ఏ హీరోయిన్ అయితే అన్ని ర‌కాలుగా మ్యాచ్ అవుతుంది? అనే ఓ లెక్క ఉంటుంది. స్టార్ హీరోయిన్ గా పాపుల‌ర్ అయితే కొన్ని విష‌యాల్లో అడ్జెస్ట్ అవుతుంటారు.

అప్ క‌మింగ్ హీరోయిన్ల విష‌యంలో ఈ కొల‌మాన‌ల్ని ప్ర‌మాణికంగా మారుతుంటాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎత్తైన హీరుయిన్లు ఎవ‌రంటే? అనుష్క‌..పూజాహెగ్డే పేర్లు ముందుగా వినిపిస్తుంటాయి. అనుష్క ..పూజాహెగ్డేల ఎత్తు ఒకేలా ఉంది.

ఇద్ద‌రు 175 సె..మీ. వీళ్ల‌నే భారీ హైట్ ఉన్న హీరోయిన్ల‌గా ప‌రిశ్ర‌మ భావిస్తుంది. వీళ్ల‌కి జోడీగా సెట్ అవ్వాలంటే మ‌హేష్..ప్ర‌భాస్..రానా లాంటి వాళ్లు అయితేనే బ్యాలెన్స్ అవుతారు. మిగ‌తా ఏ హీరో అయినా ఎత్తుని కెమెరా ఆధారంగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

తాజాగా అనుష్క‌..పూజాహెగ్డేల మించిన ఎత్తున హీరోయిన్ ఫ‌రియా అబ్ధుల్లా. ఈ బ్యూటీ ఎత్తు 177 సెమీ. మ‌రి ఈ హైట్ అవ‌కాశాల ప‌రంగా ఇబ్బందిగా మారే అవ‌కాశం ఉందా? అంటే సింపుల్ గా అలాంటిదేమీ లేద‌ని తేల్చేసింది.

'నా ఎత్తు నాకు ఎప్ప‌టికీ మైన‌స్ కాదంటూ' న‌వ్వేసింది. 'జాతిర‌త్నాలు' సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అటుపై 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'-'బంగార్రాజు' -'లైకే షేర్ అండ్ సబ్ స్ర్కైబ్' చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం మాస్ రాజార‌వితేజ హీరోగా న‌టిస్తోన్న 'రావ‌ణాసుర‌'లో న‌టిస్తోంది. ఇంకా త‌మిళ్ లోనూ అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయి. న‌టిగా అమ్మ‌డికి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు ద‌క్కింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.