Begin typing your search above and press return to search.
ఆస్కార్ హాలులో రాజమౌళి సిట్టింగ్ పై రాద్దాంతం!
By: Tupaki Desk | 14 March 2023 11:39 AM GMTఆస్కార్ ఉద్విగ్న భరిత సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. 'నాటు నాటు' ఆస్కార్ ఎంపికయ్యే వేళ దేశమంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ కి గురైంది. ఇక లాస్ ఏంజెల్స్ లో లైవ్ లో ఉన్నా రాజమౌళి... కీరవాణి..రమా..చంద్రబోస్ ఇంకెంత ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఆ హాలులోకి ఎంట్రీ దొరకమే గొప్ప అచీవ్ మెంట్. అలాంటింది 'నాటు నాటు' ఆస్కార్ కి ఎంపికైన వేళ ఇంకెలాంటి అనుభూతికి లోనవుతామో చెప్పాల్సిన పనిలేదు.
అందులో లైవ్ లో ఉన్న వారి పరిస్థితి గురించైతే మాటల్లో చెప్పలేనిది. 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ అంతా అదే సన్నివేశాన్ని ఫేస్ చేసారు. ఓసారి ఆ సంగతులు చూస్తే- 'నాటు నాటు' పాటని విజేతగా ప్రకటించిన ప్పుడు ఎగ్జిట్ దగ్గర చివరి వరుసలో రాజమౌళి- ఆయన భార్య రమ కూర్చున్నారు. అయితే ఆపక్కన రామ్ చరణ్ -ఆయన భార్య ఉపాసన జూనియర్ ఎన్టీఆర్ లేరు. అనంతరం విజేతను ప్రకటించిన తర్వాత రాజమౌళి - అతని బృందం వేదికపైకి వెళ్లడం కూడా వీడియోలో కనిపిస్తుంది.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. దీంతో మెజార్టీ వర్గం ఈ వీడియో పుటోజ్ ని మరొక కోణంలో కూడా చూస్తున్నారు.ఎస్ఎస్ రాజమౌళి -అతని బృందం వరుస చివరలో ఎగ్జిట్ దగ్గర ఎందుకు? కూర్చున్నారని వారు ప్రశ్నించారు. కొందరు దానిని అవమానంగానూ తీసుకున్నారు. వెనుకభా గంలో రాజమౌళి కూర్చుంటే.. ఆ ముందు నటి దీపికా పదుకొనే కూర్చున్నారు. 'ఇది అవమానకరం' అని ఒక ట్వీట్ లో ఒకరు పేర్కొన్నారు. అలాగే ది హాలీవుడ్ రిపోర్టర్ కూడా ' ఆర్ ఆర్ ఆర్ బృందం వెనుక కూర్చోవడం అవమానకరం' అని వ్యాఖ్యానించింది.
'వారు గెలుస్తారని మీకు తెలిస్తే మీరు వారిని వెనుకవైపు ఎలా ఉంచుతారు' అని మూడవ కామెంట్ గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ విజేత రాజమౌళి కాదని గమనించాలి. విజేతలుగా కీరవాణి- చంద్రబోస్‌లకు ముందు సీట్లతో పాటు కుటుంబ సభ్యులకు ఒక్కో సీటు కేటాయించారు. అలాగే దీపికా పదుకొణెకు ప్రెజెంటర్‌గా ఆహ్వానం అందడంతో ఆమెకు ముందు సీటు కల్పించారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్ -కాలభైరవ వేదికపై ప్రదర్శకులు కావడంతో హాల్‌లోకి అనుమతించారు.
వాళ్ల ప్రదర్శన అయిన తర్వాత వారు చుట్టుపక్కల కనిపించలేదు. రామ్ చరణ్- ఉపాసన - జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఈవెంట్‌కు పాస్‌లు అందుకోకపోవడంతో వారు హాల్‌లో కనిపించలేదు. రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అయినప్పటికీ ఆస్కార్ హాలులో సాధారణ ప్రేక్షకుడిలానే ఉన్నారు.
'ఆర్ ఆర్ ఆర్' బృందానికి విజేతలకు నిర్ణీత సంఖ్యలో పాస్‌లు - వారి సంబంధిత కుటుంబ సభ్యులకు ఒక్కో సీటు మాత్రమే ఇవ్వబడింది. అక్కడ భారతదేశం తరహాలో సిఫార్సులు పనిచేయవు. హాలులో చాలా పరిమిత సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉంటాయి. వాటిని బట్టే అనుమతి ఉంటుంది. వారు కేటాయించిన విధంగానే హాలులో అంతా కూర్చోవల్సి ఉంటుందన్నది గ్రహించాల్సిన విషయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.