Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఖుషి ఫస్ట్ సింగిల్

By:  Tupaki Desk   |   11 May 2023 9:27 AM GMT
ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఖుషి ఫస్ట్ సింగిల్
X
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జోడీ గా తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రం ఖుషి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. చాలా రోజుల తర్వాత సమంత చేస్తోన్న ప్యూర్ లవ్ స్టొరీ చిత్రం ఇదే కావడం. అలాగే లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత రౌడీ స్టార్ నుంచి రాబోతున్న మూవీ కావడంతో ఖుషి పై మంచి హైప్ ఉంది.

గీతా గోవిందం స్టైల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని శివ నిర్వాణ ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే రౌడీ స్టార్ విజయ్ బర్త్ డే కానుకగా ఖుషి చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు యుట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

ఈ విషయాన్ని పోస్టర్ వేసి చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. యుట్యూబ్ లో వరల్డ్ టాప్ ఆల్బమ్ లిస్టులో ఖుషి తెలుగు వెర్షన్ సాంగ్ టాప్ 4లో ఉండగా హిందీ వెర్షన్ సాంగ్ 8వ స్థానంలో ఉండటం విశేషం. దీనిని బట్టి ఈ సాంగ్ కి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. శివ నిర్వాణ ఈ పాటకి సాహిత్యం అందించగా మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి అతనే పాటని ఆలపించారు.

మెలోడీయస్ గా సాగే ఈ సాంగ్ కి మంచి స్పందన వస్తూ అన్ని భాషలలో కలిపి 15 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే" అంటూ సాగే ఈ పాటలో మణిరత్నం సినిమాలు అన్నింటిని కలిపి లెరిక్స్ గా మార్చి రాయడం విశేషం. ఈ సాంగ్ ద్వారా శివ నిర్వాణలో మంచి లెరిక్ రైటర్ కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు.

మూవీ థీమ్ ని ప్రెజెంట్ చేస్తూనే ఆహ్లాదంగా ఉండటంతో ఈ సాంగ్ కి యుట్యూబ్ లో విశేష మైన ఆదరణ వస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ కావడంతో ఖుషి సినిమా పై మరింత హైప్ పెరిగిందని చెప్పాలి. ప్రేమ కథలని డీల్ చేయడంలో శివ నిర్వాణ బెస్ట్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడెమో చూడాలి.