Begin typing your search above and press return to search.

ఆది పురుష్ కోసం 'హనుమాన్' వచ్చినట్టుంది!

By:  Tupaki Desk   |   8 Jun 2023 8:00 AM GMT
ఆది పురుష్ కోసం హనుమాన్ వచ్చినట్టుంది!
X
ఆది పురుష్.. ఆది పురుష్... ఆది పురుష్... ఇప్పుడీ నామజపమే దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇంకొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కనీవిని ఎరుగని రీతిలో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు భారీగా ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ హాజరై సక్సెస్ చేశారు. అయితే ఆదిపురుష్ ఈవెంటు సక్సెస్ వెనుక ఓ హనుమంతుడి కృషి ఉంది.

నిజమే... ఆదిపురుష్ కోసం హనుమంతుడు వచ్చి.. ఈ ఈవెంటును సక్సెస్ చేశారని అనుకుంటున్నారు. అది ఎవరో కాదు... డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వైవిధ్య భరితమైన సినిమాలు తెరకెక్కించే ఆయన ప్రస్తుతం హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ రెగ్యూలర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంటులా కాకుండా.. సినిమాకు తగ్గట్లు ప్లాన్ చేశారు. దీని వెనుక ప్రశాంత్ వర్మ కృషి ఉంది.

షో ప్రోమోస్ , భారీ సెట్టింగ్స్ , స్పెషల్ డిజైనింగ్ , ఈవెంట్ ఐడియాలు వీటికి ప్రశాంత్ వర్మ స్పెషలిస్ట్. అందుకే ప్రభాస్ కోసం ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. రెండు మూడు వారాలుగా ఈవెంట్ కోసం ప్లానింగ్ రెడీ చేశాడు. రెండు రోజుల ముందే... తిరుపతి వెళ్లి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఆయన కృషిని గుర్తించిన ప్రభాస్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు స్పెషల్ గా థ్యాంక్స్ కూడా చెప్పారు.

రామాయణంలో శ్రీ రాముడికి హనుమంతుడు సాయం చేస్తే... రాముడి కథతో వస్తున్న ప్రభాస్ సినిమా ఆదిపురుష్ కోసం... హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సాయం అందించి ఈవెంట్ సక్సెస్ చేశారని అంతా అనుకుంటున్నారు. అలా ఆదిపురుష్ కోసం హనుమాన్ దిగివచ్చినట్లైందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే రామాయణం ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.