Begin typing your search above and press return to search.

మాస్ హీరో న్యూ మూవీ.. డైరెక్ట్ ఓటీటీ

By:  Tupaki Desk   |   23 May 2023 10:18 PM GMT
మాస్ హీరో న్యూ మూవీ.. డైరెక్ట్ ఓటీటీ
X
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ నుంచి మరో చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో విజయ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.

భూ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఒటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మే 27న జియో సినిమాలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది. ఆమెతో పాటు మేఘా ఆకాష్, నివేతా పెతురాజ్, విద్యుల్లత రామన్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ నాలుగు చుట్టూ అల్లుకున్న హర్రర్ థ్రిల్లర్ కథాంశంగా ఈ మూవీ ఉండబోతోందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.

హర్రర్ జోనర్ లోనే చిత్రాన్ని దర్శకుడు విజయ్ ఆవిష్కరించారు. విశ్వక్ సేన్ పేరు చెప్పిన కూడా ట్రైలర్ లో ఎక్కడా కూడా అతని పాత్రని రివీల్ చేయలేదు. సడెన్ గా ఎలాంటి హైప్ లేకుండా ఈ మూవీ మే 27న రిలీజ్ కాబోతోందని డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేయడం విశేషం. ఈ సినిమాని ఎప్పుడు షూట్ చేశారో క్లారిటీ లేదని చెప్పాలి.

ఏది ఏమైనా ట్రైలర్ చూస్తూ ఉంటే కంటెంట్ ఏదో కొత్తగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మరి విశ్వక్ సేన్ పాత్ర ఈ మూవీలో ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ఇక కొండపొలం మూవీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చేస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. డైరెక్ట్ గా ఒటీటీలోనే రిలీజ్ కాబోతూ ఉండటం, అలాగే జియో సినిమాలో ఫస్ట్ తెలుగు ఇదే కావడం విశేషం.

ఇప్పటికే జియో సినిమా ఐపీఎల్ మ్యాచ్ లతో దేశ వ్యాప్తంగా అందరికి చాలా వేగంగా చేరువ అయిపొయింది. ప్రపంచంలోనే అత్యధికంగా అతి తక్కువ టైమ్ లో ఇన్ స్టాల్స్ సాధించిన యాప్ గా జియో సినిమా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు సౌత్ సినిమాలపై ఫోకస్ చేస్తుందని ఈ బూ రిలీజ్ తో కన్ఫర్మ్ అయ్యింది.