Begin typing your search above and press return to search.

పవన్ BRO వచ్చేశాడు.. రిలీజ్ డేట్ చెప్పేశాడు!

By:  Tupaki Desk   |   18 May 2023 4:42 PM GMT
పవన్ BRO వచ్చేశాడు.. రిలీజ్ డేట్ చెప్పేశాడు!
X
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి మెగా మేనల్లుడు, యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సీతమ్ కు రీమేక్. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాయగా... నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. అలాగే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికా శర్మ కనిపించనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. టైటిల్ తో పాటు సినిమాలో మామా అల్లుళ్లు ఎలా ఉండబోతున్నారో తెలిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.

అయితే పవన్ కల్యాణ్, సాయ్ ధరమ్ తేజ్ ల సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా మోషన్ పోస్టర్ కోసం సంగీత సంచలనం తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

ఇందులో పవన్ కల్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటేనే ఆ విషయం అర్థం అవుతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యాక్సిడెంట్ లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. పవన్ కల్యాణ్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం ఇది రెండోసారి. గతంలో గోపాల గోపాల లో శ్రీకృష్ణుడిగా కనిపించి మెప్పించారు.

జూలై 28వ తేదీన బ్రో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కనిపపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో నటించడానికి పవన్ కల్యాణ్ దాదాపుగా 50 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రోజుకు రెండు కోట్లు తీసుకున్నారట.