Begin typing your search above and press return to search.

కొడుకును పరిచయం చేసి పేరు చెప్పిన జాతిరత్నం

By:  Tupaki Desk   |   25 April 2023 10:58 AM GMT
కొడుకును పరిచయం చేసి పేరు చెప్పిన జాతిరత్నం
X
అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండకి స్నేహితుడి పాత్రలో నటించి నవ్వించిన రాహుల్ రామకృష్ణ జాతిరత్నాలు సినిమా తో టాలీవుడ్‌ మరింత ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్న రాహుల్‌ రామకృష్ణ గత ఏడాది హరిత ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

రాహుల్ రామకృష్ణ పెళ్లి సమయంలో సోషల్‌ మీడియాలో ఫొటోలు మరియు వీడియోలు సందడి చేశాయి. గత ఏడాది ఒక్కటి అయిన రాహుల్ మరియు హరిత ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన హరిత ఫోటోను రాహుల్‌ రామకృష్ణ సోషల్‌ మీడియా లో షేర్‌ చేశాడు.

తన కొడుకు పేరును రూమి అంటూ ప్రకటించడంతో పాటు తన కొడుకు ఫోటోను కూడా షేర్‌ చేసి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో షేర్‌ చేసుకున్నాడు. బ్లాక్ అండ్‌ వైట్‌ కలర్‌ లో ఈ ఫోటోను షేర్‌ చేశాడు.

రాహుల్‌ రామకృష్ణ కేవలం కమెడియన్ పాత్రల్లోనే కాకుండా అప్పుడప్పుడు విలన్ వేశాలు వేస్తున్నాడు. సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు. మరో వైపు వెబ్‌ సిరీస్ ల్లో కూడా రాహుల్ రామకృష్ణ నటిస్తూ బిజీ బిజీ గా కొనసాగుతున్నాడు.