Begin typing your search above and press return to search.
ఖాన్ జీ బట్టతల ఎంత పని చేసింది గురూ!
By: Tupaki Desk | 11 July 2023 10:59 AM GMTబట్టతల ఉందని ఆవేదన ఎందుకు? కళాకారుడికి బట్టతల కూడా అందమే. దాంతో చాలా మ్యాజిక్ లు జిమ్మిక్కులు చేయొచ్చు. దీనిని పలు చిత్రాల్లో స్టార్ హీరోలు ప్రాక్టికల్ గా నిరూపించారు. ఇంతకుముందు ఆయుష్మాన్ ఖురానా బట్టతల కుర్రాడి వెతలు అన్నీ ఇన్నీ కావు..! అంటూ ఒక పూర్తి నిడివి సినిమా లోనే చూపించాడు. శంకర్ తెరకెక్కించిన 'రోబో' చిత్రం లో రజనీకాంత్ బట్టత లతో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
అయితే ఇప్పుడు షారూఖ్ ఖాన్ 'జవాన్' చిత్రం లో బట్టతలతో మెరవబోతున్నాడనేది మీమ్ ఫెస్ట్ కి తెరతీసింది. పఠాన్ తో బాక్సాఫీస్ రికార్డుల ను బద్దలు కొట్టిన తర్వాత సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం జవాన్ తో మరోసారి పాన్ ఇండియా లో సంచలనాలు సృష్టించాలని కలగంటున్నాడు. సోమవారం మోస్ట్ అవైటెడ్ 'జవాన్' ప్రీవ్యూను ప్రారంభించగా.. సోషల్ మీడియాల్లో పవర్-ప్యాక్డ్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఇందులో నయనతార- విజయ్ సేతుపతి- సన్యా మల్హోత్రా యాక్షన్ అవతార్ లలో కనిపించడం ఉత్కంఠ ను పెంచింది. అంతే కాదు దీపికా పదుకొణె స్పెషల్ అప్పియరెన్స్ చూసి అందరూ ఉత్కంఠగా ఉన్నారు. అయితే షారుఖ్ బట్టతల లుక్ సోషల్ మీడియా లో అందరి దృష్టిని ఆకర్షించింది. రజనీకాంత్ రోబోలో ట్రై చేసినట్టు ఖాన్ జీ బట్టతల వేషాన్ని ట్రై చేశారంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కింగ్ ఖాన్ బట్టతల లుక్ లో అరంగేట్రం చేసి నెటిజనులను ఆశ్చర్యపరిచాడు. బెకరర్ కర్కే అనే పాత పాట లో అతడి నృత్య ప్రదర్శన జవాన్ ప్రీవ్యూ హెడ్ లైన్స్ లో ఒకటిగా మారింది. యాక్షన్- ఎమోషన్ ల మేళవింపుతో జవాన్ కథాంశం రక్తి కట్టించనుందని ఈ వీడియో చెబుతోంది. ఆసక్తికరంగా నెటిజన్లు సోషల్ మీడియా ల్లో SRK బట్టతల రూపాన్ని మీమ్స్ ఫెస్ట్ గా మార్చారు. ఖాన్ జీ డ్యాన్స్ వీడియో ను విరివిగా సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఆ లుక్ తో షారూఖ్ కి చెందిన పాపులర్ పాటలతో క్లబ్ చేసి వైరల్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ వీడియోకు 'చమక్ చల్లో..' పాటను బ్యాక్ డ్రాప్ లో పెట్టారు. ఆశ్చర్యకరంగా ఆడియో-వీడియో అతుకులు లేకుండా అద్భుతంగా కుదిరాయి. మరొక వినియోగదారు జవాన్ ప్రీవ్యూ నుండి SRK చిత్రాల కోల్లెజ్ ను షేర్ చేసారు. దానిని 'కిరాణా షాపింగ్' లుక్ అంటూ లింక్ చేయడం నవ్వులు పుట్టించింది.
జవాన్ చిత్రం లో సూపర్ స్టార్ షారూఖ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. మునుపెన్నడూ చూడని అవతార్ లో SRKని చూడటాని కి అభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. జవాన్ ప్రీవ్యూ సినిమా లవర్స్ లో క్యూరియాసిటీ ని అమాంతం పెంచింది. సినిమా ఏ స్థాయి లో అలరిస్తుందో వేచి చూడాలి. ప్రియమణి- గిరిజా ఓక్ - సంజీతా భట్టాచార్య- లెహర్ ఖాన్- ఆలియా ఖురేషి- రిధి డోగ్రా- సునీల్ గ్రోవర్ - ముఖేష్ ఛబ్రా తదితరులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఇది హిందీ- తమిళం - తెలుగు భాషల్లో విడుదల కానుంది.