Begin typing your search above and press return to search.
ఈ అగ్ర హీరోతో ఫిదా చేసుంటే..?
By: Tupaki Desk | 6 Jun 2023 10:00 AM GMTశేఖర్ కమ్ముల కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే ఫిదా అని చెప్పొచ్చు. ఆ సినిమా అంచనాలకి మించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానికి కారణం సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కూడా ఒకటని చెప్పొచ్చు. ఇది తెలుగులో సాయి పల్లవి డెబ్యూ మూవీ అయిన సొంతగా డబ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంగా స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ని సాయి పల్లవి సొంతం చేసుకుందని చెప్పొచ్చు.
వరుణ్ తేజ్ కెరియర్ కి కూడా ఫిదా మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే వరుణ్ తేజ్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబుని, అలాగే సాయి పల్లవి పాత్రలో దీపికా పదుకునేని ఫిదా సినిమాలో ఊహించుకోండి. అసలు ఆ ఊహని కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కనెక్ట్ కాలేరు. అలాగే సాయి పల్లవి పాత్రలో ఆమెని తప్ప మరో హీరోయిన్ ని అస్సలు డైజిస్ట్ చేసుకోలేరు.
అంతలా ఫిదా సినిమాలో సాయి పల్లవి, వరుణ్ తేజ్ పాత్ర జనాల్లోకి చొచ్చుకుపోయాయి. అయితే నిజానికి ఈ సినిమాని శేఖర్ కమ్ముల సూపర్ స్టార్ మహేష్ బాబు కోసమే, ఆయనని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారంట. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సూపర్ స్టార్ కోసం రెడీ చేసుకున్న ఫిదా సినిమా కథని అతనికి వినిపించడం కూడా జరిగిందంట.
ఇక మహేష్ బాబు విపరీతంగా కనెక్ట్ అయ్యి చేద్దామని కూడా శేఖర్ కమ్ములకి మాటిచ్చారంట. దీంతో మహేష్ బాబుకి జోడీగా దీపికా పదుకునేని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారంట. కథని కూడా గ్రాండ్ స్కేల్ పై చెప్పాలని భావించారంట. ఈ విషయాన్ని శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే మహేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ కాలేదు.
దీంతో కొన్ని మార్పులు చేసి వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమాని మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఫిదా సినిమా చూసిన వారు మాత్రం మహేష్ బాబు ఇమేజ్ కి అస్సలు ఫిదా స్టొరీ సెట్ కాదని తేల్చేస్తున్నారు. హీరోయిన్ డామినేషన్ ఉన్న కథలని సూపర్ స్టార్ అభిమానులు అస్సలు యాక్సప్ట్ చేయలేరనే మాట వినిపిస్తోంది.