Begin typing your search above and press return to search.

సలార్ : ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు

By:  Tupaki Desk   |   21 Jun 2023 1:00 PM GMT
సలార్ : ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు
X
కేజీఎఫ్‌ ఫిల్మ్‌ మేకర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం 'సలార్‌'. ప్రభాస్ హీరో గా శృతి హాసన్‌ హీరోయిన్‌ గా రూపొందుతున్న సలార్ సినిమా లో నటి శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో శ్రియా రెడ్డి పాత్ర పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రియా రెడ్డి మాట్లాడుతూ సలార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేజీఎఫ్‌ సినిమా ను మించి సలార్ ఉంటుంది. కేజీఎఫ్‌ వేరు... సలార్‌ వేరు. గేమ్‌ ఆఫ్ థ్రోన్స్‌ కోసం ఎలా అయితే ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారో.. అలాగే ఈ సినిమా కోసం కూడా ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు అంటూ ఆమె పేర్కొంది.

సినిమా లోని ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ యొక్క పాత్రలు వేరే లెవల్‌ లో ఉంటాయంది. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రపంచం మాదిరిగా కాకుండా సలార్ లో సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నట్లుగా పేర్కొంది. ఆ ప్రపంచం లో సృష్టించిన ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుల మైండ్‌ బ్లోయింగ్‌ అన్నట్లుగా ఉంటాయని ఆమె తెలియజేసింది.

శ్రియా రెడ్డి చేసిన వ్యాఖ్యల తో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ సినిమా నిరాశ పర్చింది. అయినా కూడా భారీ ఎత్తున వసూళ్లు వస్తున్నాయి. ఇదే సంవత్సరం సలార్‌ సినిమా రాబోతుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.