Begin typing your search above and press return to search.
సూర్య ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆ సినిమా మళ్లీ థియేటర్లలో..
By: Tupaki Desk | 25 Jun 2023 4:00 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తెలుగు ప్రేక్షకులకు గజనీ సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అన్నీ తెలుగులో డబ్బింగ్ అయ్యేవి. అయితే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాకు ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
అదేంటంటే.. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కదా.. అందులో భాగంగా సందర్భాన్ని బట్టి.. ఆ హీరో లేదా డైరెక్టర్ సినిమాను రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సూర్య వంతు వచ్చిందన్నమాట. అందులో భాగంగానే... సూర్య నటించిన లవ్ ఎంటర్ టైన్మెంట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రీ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా 14 నవంబర్ 2008న విడుదలై.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురించింది. ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్.. తండ్రిగా, కొడుకుగా మెప్పించాడు. ఇక ఈ సినిమాలో సిమ్రాన్, సమీరా రెడ్డి, రమ్య హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ మ్యూజిక్. హ్యారిష్ జయ్ రాజ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ను కంపోజ్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమా సూర్య బర్త్డే జూలై 23 సందర్భంగా.. జూలై 21న 4కె వెర్షన్ లో రీ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. యూఎస్ఏ లో జూలై 19నే రానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సూర్య నటనకు మంచి పేరు లభించింది. ఈ సినిమాకు అవార్డులు సైతం వచ్చాయి. ఇది తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.
ఇక ప్రస్తుతం సూర్య కంగువా అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.