Begin typing your search above and press return to search.

NTR30: సముద్రం నిండా అతని కథలే..

By:  Tupaki Desk   |   19 May 2023 11:01 AM
NTR30: సముద్రం నిండా అతని కథలే..
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR30 సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈరోజు విడుదల చేయబోతున్నట్లు గురువారం(మే 18) రోజే చిత్ర బృందం ప్రకటించింది.

శుక్రవారం (మే 19) అంటే ఈరోజు రాత్రి 7:02 గంటలకు ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. "సముద్రం అతని కథలతో నిండిపోయింది. అవి రక్తంతో రాసినవి" అవి రక్తంతో రాసినవి అనే క్యాప్షన్ ఉన్న పోస్టర్ ను సినీ మేకర్స్ విడుదల చేశారు. సముద్రం ఒడ్డున రక్తంతో తడిసిన కత్తులను కూడా ఈ పోస్టర్ లో చూడవచ్చు.

ఈ సినిమాకు డైరెక్టర్ కొరటాల శివ ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పలు పేర్లు పరిశీలించిన తర్వాత ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

హీరో ఎన్టీఆర్ సహా, చిత్ర నిర్మాతలు ఈ టైటిల్ బాగుందని చెప్పినట్లు సమాచారం. ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు ఓ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో భాగంగానే ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సన్నివేషాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

అయితే అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా నటించబోతున్నారు. ఈ సినిమా ఓ కల్పిత దీవి అని... పోర్టు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.