Begin typing your search above and press return to search.

యష్ ప్లాన్ మామూలుగా లేదు.. ఏకంగా రావణ అవతారం!

By:  Tupaki Desk   |   20 Feb 2023 7:00 AM GMT
యష్ ప్లాన్ మామూలుగా లేదు.. ఏకంగా రావణ అవతారం!
X
కన్నడ మూవీ ఇండస్ట్రీ కేజీఎఫ్ కు ముందు, కేజీఎఫ్ కు తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఒక్క సినిమా అటు డైరెక్టర్ కు, ఇటు హీరో యష్ కు, మరోవైపు నిర్మాతకు, ఇంకో వైపు కన్నడ ఇండస్ట్రీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు తెచ్చిపెట్టింది. కేజీఎఫ్ సూపర్ డూపర్ సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం సౌత్ స్టేట్స్ లోనే కాకుండా, నార్త్ లోనూ ఈ సినిమా విపరీతంగా వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఒక్క సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు యష్. కేజీఎఫ్ 2 కూడా భారీ హిట్ అందుకుంది. దీంతో యష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి.

ఇప్పటి వరకు యష్ చాలా ఆచితూచీ వ్యవహరిస్తూ వస్తున్నాడు. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో వచ్చిన స్టార్ డమ్ ను కాపాడుకునేందుకు మంచి కథలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసే అవకాశం యష్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆపర్చునిటీని యష్ రెండు చేతులా అందిపుచ్చుకున్నట్లు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

అమీర్ ఖాన్ తో సూపర్ హిట్ మూవీ తీసిన దర్శకుడు నితీశ్ తివారి డైరెక్షన్ లో రామాయణ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటిస్తున్నారు.

అయితే ఇందులో రావణాసుర పాత్రను యష్ కు ఆఫర్ చేసినట్లు, యష్ కూడా పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ విజువలైజేషన్ చూసిన యశ్.. చాలా థ్రిల్ ఫీల్ అయ్యారని, ఇప్పటికే ఈ టీమ్ తో పలుసార్లు సమావేశం అయ్యారని తెలిసింది. అన్నీ కుదిరితే రామాయణ సినిమాలో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు.

బ్రహ్మాస్త్ర 2 లో దేవ్ పాత్రను యష్ కు ఆఫర్ చేశారట. అయితే యష్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడట. ఇప్పుడు రావణాసురుడి పాత్రను మాత్రం చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామాయణ తో పాటు జంగిల్ అడ్వెంచర్, ఒక సైఫా మూవీ, మరో గ్యాంగ్ స్టర్ కథలను యష్ పరిశీలిస్తున్నట్లు కన్నడ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.