Begin typing your search above and press return to search.
‘అ..ఆ’ ఆడియో అదిరిందబ్బా..
By: Tupaki Desk | 3 May 2016 11:30 AM GMTతెలుగుదనం ఉన్న అర్థవంతమైన.. సరదాగా అనిపించే లిరిక్స్.. ఫ్రెష్ గా అనిపించే బాణీలు.. చక్కటి గానం.. మొత్తంగా ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఆల్బమ్ ‘అ..ఆ’ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. తన మెలోడియస్ మార్కు వదిలి పెట్టకుండానే.. త్రివిక్రమ్ మార్కు ఎనర్జీని క్యారీ చేస్తూనే చక్కటి తెలుగుదనం ఉన్న ఆడియో అందించాడు మిక్కీ జె.మేయర్. త్రివిక్రమ్ గత సినిమాల తరహాలో ఊపున్న ఎనర్జిటిక్ సాంగ్స్ లేని లోటు కొంచెం కనిపిస్తుంది కానీ.. ‘అ..ఆ’ సినిమా కోణంలో చూస్తే మాత్రం ఇది వంద శాతం సరైన ఆల్బమ్ అని చెప్పాలి. ఓ ఫీల్ గుడ్ సినిమాకు.. ఫీల్ గుడ్ ఆల్బమే అందించాడు మిక్కీ. ముందు మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్న అనిరుధ్ కంటిన్యూ అయి ఉంటే ఈ సినిమాకు ఎలాంటి పాటలిచ్చేవాడో కానీ.. మిక్కీ మాత్రం పర్ఫెక్ట్ ఆల్బమే అందించాడు.
‘అ..ఆ’లో మొత్తం ఐదు పాటలుండగా.. అందులో నాలుగు పాటల్ని రామజోగయ్య శాస్త్రే రాశారు. ప్రతి పాటలోనూ ఆయన కలం ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆడియోకు ప్రధాన ఆకర్షణ రామజోగయ్య లిరిక్సే అని చెప్పాలి. ముఖ్యంగా ఎళ్లిపోమాకే శ్యామలా పాటలో లిరిక్స్ ఇన్ స్టంట్ గా ఎక్కేస్తాయి. చాలా సరదాగా ఉండేలా ఆ పాటకు లిరిక్స్ రాశారాయన. ఆ పాటను కార్తీక్ కూడా చాలా బాగా పాడాడు. ఇక రమ్య బెహరా-సాయిశివాని-రాహుల్ నంబియార్ కలిసి పాడిన ‘రంగ్ దే..’ పాట ఆల్బంలో మంచి ఊపున్న పాట. చాలా హుషారుగా సాగుందీ పాట. సాయిశివానీ వాయిస్ ఈ పాటకు హైలైట్.
అభయ్-చిత్ర-అంజనాసౌమ్య-సాయిశివానీ కలిసి పాడిన తొలి పాట ‘యా..యా’ కూడా సూపర్బ్ అనిపిస్తుంది. యా.. యా.. అంటూ భలే సరదాగా సాగే హమ్మింగ్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ. శ్రావణ భార్గవి పాడిన మమ్మీ రిటర్న్స్ పాట ఒక్కటే కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కృష్ణచైతన్య రాసిన ఏకైక పాట అనసూయ కోసం డిఫరెంటుగా అనిపిస్తుంది. చాలా ఫన్నీగా అనిపిస్తాయి ఈ పాట లిరిక్స్. మొత్తంగా మంచి లిరికల్ వాల్యూస్.. చక్కటి బాణీలు కుదిరిన ‘అ..ఆ’ ఆల్బం అంచనాలకు తగ్గట్లే సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా రూపొందింది.