Begin typing your search above and press return to search.
అఆకి... అమెరికాలో కోత
By: Tupaki Desk | 3 Jun 2016 7:36 AM GMTతెలిసిన కథేగా అని కొంతమంది పెదవి విరుస్తున్నప్పటికీ అమెరికాలో మాత్రం అఆ దుమ్ము దులిపేస్తోంది. ప్రీమియర్ షోలతోనే నితిన్ కెరీర్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. త్రివిక్రమ్ కి అమెరికా కంచు కోట అని మరోసారి రుజువైంది. సినిమా 2మిలియన్ల మార్క్ ని అలవోకగా చేరుకొంటుందని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఆ విషయంలో చిత్రబృందం హ్యాపీగా ఉంది. అక్కడి ప్రేక్షకుల్ని మరింతగా అలరించడం కోసం అఆ సినిమాలో నాలుగు నిమిషాల్ని తీసేసి ట్రిమ్ చేశారట. దీంతో తొలి సగభాగంలో కూడా సినిమా పరుగులు పెడుతోందట. ఈ రోజు నుంచే అక్కడ కొత్త వెర్షన్ ప్రదర్శితమవుతుంది. మరి ఈ నిర్ణయం అమెరికా వరకే ఎందుకు సరిపెట్టారో అర్థం కావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యాజిటీజ్ గా సినిమాని చూపిస్తున్నారు.
సహజంగానే విదేశాల్లో సినిమాలు తక్కువ నిడివితో సాగుతుంటాయి. మరీ సాగదీసినట్టు అనిపిస్తే వాళ్లకి అంతగా రుచించదు. అమెరికాలో ఉంటున్నారు కాబట్టి హాలీవుడ్ సినిమాలు చూడటం బాగా అలవాటయ్యుంటుందని అక్కడ మాత్రమే సినిమాని నాలుగు నిమిషాల ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది. ఎవరెలా స్పందిస్తున్నా విమర్శకులు మాత్రం సినిమాని నెత్తిన పెట్టుకొన్నారు. దీంతో సినిమాకి మంచి వసూళ్లు లభిస్తున్నాయి. సినిమాకొస్తున్న రిజల్ట్ పట్ల నితిన్ సంబరాలు చేసుకొంటున్నట్టు సమాచారం. ఆయనకి కొంతకాలంగా దెబ్బ మీద దెబ్బ పడుతూ వచ్చింది కాబట్టి ఈ రిజల్ట్ తో బాగా తేరుకొన్నాడట. తదుపరి మరింత స్థాయి ఉన్న సినిమాని చేయబోతున్నట్టు సమాచారం.