Begin typing your search above and press return to search.
అ..ఆ.. 'అ'ప్పుడే 'ఆ'పేస్తారా??
By: Tupaki Desk | 16 Jun 2016 3:46 AM GMTప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దిగ్విజియంగా రన్ అవుతున్న సినిమా ''అ..ఆ'' ఒక్కటే. కాకపోతే మాస్ సెంటర్లలో ''సుప్రీమ్'' ''సరైనోడు'' సినిమాలు కూడా ఆడుతున్నాయిలేండి. అయితే ''అ..ఆ'' యొక్క గోల్డెన్ రన్ ను ఆపేసే సినిమాలేవైనా వస్తున్నాయా? అసలు అంత స్టామినా ఉన్న రిలీజులు ఏమున్నాయి ఇప్పుడు? పదండి ఓ లుక్కేద్దాం.
నిజానికి రెండు సినిమాలు మాత్రమే ''అ..ఆ'' బ్లాక్ బస్టర్ సక్సెస్ కు అడ్డుకట్ట వేసేలా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి నాని ''జెంటిల్ మన్'' అయితే.. మరొకటి నిహారిక ''ఒక మనసు'' సినిమా. అసలే నాని ఫ్యామిలీస్ లో మాంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. కాబట్టి ఓ మోస్తరుగా నచ్చేసినా కూడా సినిమా హిట్టయిపోతుంది. ఈ సినిమా రేపే రిలీజ్. ఆ తరువాతి వారం వస్తున్న సినిమా నిహారికదే. ఇది పక్కా లవ్ స్టోరి. యూత్ కు కనెక్టయ్యిందంటే మాత్రం క్లిక్కయిపోతుందంతే. అప్పుడు ఖచ్చితంగా త్రివిక్రమ్ మాయకు బ్రేక్ వేసేయొచ్చు. మరి ఇంత త్వరగా మరో రెండు హిట్లు ఇచ్చేసి అ..ఆ.. క్రేజ్ ను అప్పుడే ఆపేస్తారా? చూద్దాం.
కాకపోతే ఈ రెండు సినిమాలూ తమ సత్తా చాటేలోపే అ..ఆ ఖచ్చితంగా 50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.