Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: ‘అ..ఆ’
By: Tupaki Desk | 2 Jun 2016 9:47 AM GMTచిత్రం : ‘అ ఆ’
నటీనటులు: నితిన్ - సమంత - అనుపమ పరమేశ్వరన్ - నదియా - రావురమేష్ - నరేష్ - ఈశ్వరి - అనన్య - ప్రవీణ్ - జయప్రకాష్ - అవసరాల శ్రీనివాస్ - గిరిబాబు - పోసాని కృష్ణమురళి - అజయ్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: నటరాజ్ సుబ్రమణ్యం
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన-దర్శకత్వం: త్రివిక్రమ్
‘అ..ఆ’ పేరుతోనే ఆకర్షించిన సినిమా. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో నిరాశ పరిచినప్పటికీ.. తన తర్వాతి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్లో ఎప్పట్లాగే ఆసక్తి రేకెత్తించించాడు త్రివిక్రమ్. నితిన్-సమంతల ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు తోడు.. అనేక సానుకూలాంశాలు తోడై ‘అ ఆ’ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
అనసూయ రామలింగం (సమంత) అమ్మ చేతిలో తానో ఆటబొమ్మలా అయిపోయానని.. తనకంటూ ఏ స్వేచ్ఛా లేకపోయిందని బాధపడే అమ్మాయి. తనకు ఇష్టం లేని పెళ్లి నిర్ణయించడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేస్తుంది. అయినా ఆమె తల్లి మహాలక్ష్మి (నదియా)లో ఏ మార్పూ ఉండదు. ఇలాంటి స్థితిలో మహాలక్ష్మి ఊరెళ్తే ఆమెకు తెలియకుండా పల్లెటూర్లోని తన అత్తయ్య వాళ్లింటికి వెళ్తుంది అనసూయ. అక్కడ అత్తయ్య కొడుకు ఆనంద్ విహారి (నితిన్) ఆమెకు తెగ నచ్చేస్తాడు. ఐతే ఆనంద్ కుటుంబానికి.. మహాలక్ష్మి అంటే పడదు. పైగా ఆస్తుల అంతరమూ ఉంటుంది. దీంతో ఆనంద్.. అనసూయకు దూరం దూరంగా ఉంటుంటాడు. పైగా అతను తప్పనిసరి పరిస్థితుల్లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చి ఉంటాడు. ఐతే పది రోజులు పల్లెటూర్లో ఉన్నాక తన తల్లి తిరిగి ఇంటికి వస్తోందని తెలిసి తిరిగి సిటీకి బయల్దేరుతుంది అనసూయ. రాగానే ఆమె పెళ్లికి ఏర్పాట్లు మొదలైపోతాయి. మరి ఈ పరిస్థితుల్లో అనసూయ-ఆనంద్ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
త్రివిక్రమ్ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అని గట్టి నమ్మకం తెలుగు ప్రేక్షకులకు. థియేటర్లలో చూసి పెదవి విరిచిన సినిమాల్ని కూడా మళ్లీ టీవీల్లో పనిగట్టుకుని చూస్తుంటారు. డిజాస్టర్ అనిపించుకున్న ‘ఖలేజా’ కూడా టీవీల్లో మాత్రం సూపర్ హిట్టయింది. త్రివిక్రమ్ చమత్కారమే అతడి సినిమాల బలం. మిగతా అంశాలు ఎలా ఉన్నా.. అతడి నుంచి ప్రధానంగా వినోదాన్నే ఆశిస్తారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఆ వినోదం పాళ్లే తగ్గిపోయాయి. దీంతో త్రివిక్రమ్ పెన్ను మొద్దుబారిందేమో అని సందేహించారు జనాలు. ఐతే ఈసారి త్రివిక్రమ్ పెన్నును మళ్లీ పదునెక్కించాడు. కుటుంబ కథల్ని వినోదాత్మకంగా చెప్పడంలో పెన్ను తిరిగిన త్రివిక్రమ్.. మరోసారి తన బలాన్నే నమ్ముకున్నాడు. సాదాసీదాగా అనిపించే మామూలు కథనే.. బోలెడంత వినోదం.. కొంచెం ఎమోషన్ జోడించి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మలిచాడు.
ఏ హడావుడి లేకుండా సింపుల్ గా.. ఆహ్లాదకరంగా సాగిపోవడం ‘అ ఆ’కున్న ప్రధాన బలం. అక్కడక్కడా కొన్ని ఇరిటేటింగ్ సీన్లు వస్తాయి. కొన్ని చోట్ల సన్నివేశాలు ఇల్లాజికల్ గా సాగుతాయి. పాత్రల ఔచిత్యం కూడా దెబ్బతింటుంది. ద్వితీయార్ధంలో కొంచెం సాగతీతగా అనిపిస్తుంది. ఐతే థియేటర్ నుంచి వచ్చేటపుడు ఈ నెగెటివ్స్ ఏమీ గుర్తు లేకుండా చేయడం ‘అ ఆ’ ప్రత్యేకత. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి ‘అ ఆ’లో. కథగా చూస్తే ప్రత్యేకత ఏమీ లేకపోయినా.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగిపోయే కథనం.. త్రివిక్రమ్ మార్కు చమత్కారపు మాటలు.. సరదా సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆద్యంతం ఎంగేజ్ చేస్తాయి.
ఆరంభం మామూలుగా.. కాస్త నెమ్మదిగా అనిపించినా.. హీరోయిన్ పాత్ర పల్లెటూరి ప్రయాణం మొదలుపెట్టగానే బండి పట్టాలెక్కేస్తుంది. హీరో హీరోయిన్ల పరిచయం దగ్గర్నుంచి సన్నివేశాలు రివ్వున దూసుకెళ్తాయి. ఇంటర్వెల్ వరకు వినోదంలో తడిసి ముద్దయిపోతారు ప్రేక్షకులు. హీరో ఇంట్లో హీరోయిన్ కు పది రోజులు ఎంతో సంతోషంగా.. శరవేగంగా గడిచిపోయినట్లే.. ప్రేక్షకులకు కూడా గంట పాటు కాలం తెలియదు. ప్రథమార్ధంలో హీరో చెల్లెలి పెళ్లిచూపుల సీన్ ఒక్కటే ఇరిటేట్ చేస్తుంది. అది మినహా ప్రతి సన్నివేశం ఎంటర్టైన్ చేస్తుంది. ‘‘మరీ మినరల్ వాటర్ తో ముఖం కడుక్కుంటే బలుపనుకుంటారు. ఆ లేబిల్ తీసేయ్ రా’’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ లో త్రివిక్రమ్ మార్కు చమత్కారం కనిపిస్తుంది. ఇలాంటి చాలా డైలాగ్స్ అతడి ముద్రను చూపిస్తాయి.
ద్వితీయార్ధంలో ఓ అరగంట మాత్రం ‘అ ఆ’ సా...గుతున్న ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇక్కడ కథను ఎలా క్లైమాక్స్ వైపు తీసుకెళ్లాలో తెలియని సందిగ్ధం కనిపిస్తుంది. ఏదో మొక్కుబడిగా ఫిల్లింగ్ కోసం పేర్చినట్లు అనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు. ముఖ్యంగా షాపింగ్ మాల్ సీన్స్ తలా తోకా లేకుండా సాగుతాయి. ఐతే హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ మొదలయ్యే దగ్గర్నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకున్నాక కథ మళ్లీ గాడిన పడుతుంది. ప్రిక్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సిల్లీగా అనిపిస్తుంది. ‘అ ఆ’కు ప్రధాన ఆకర్షణ అనదగ్గ క్లైమాక్స్ లో త్రివిక్రమ్ రచయితగా, దర్శకుడిగా టాప్ ఫాంలో కనిపిస్తాడు. ఏ హడావుడి లేకుండా.. చాలా సింపుల్ డైలాగులతో సాగిపోయే పతాక సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది.
ఎదురుగా నదియాను పెట్టుకుని హీరో డైలాగులు చెప్పడం వల్ల కాబోలు క్లైమాక్స్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను గుర్తు చేసినా.. దీని ప్రత్యేకత దీనిదే. అందులో ఉన్నంత హై ఎమోషన్ ఇందులో ఉండదు. సింపుల్ గా అర్థవంతంగా ఉంటుంది పతాక సన్నివేశం. ఐతే ఆ ఎమోషనల్ సీన్ కంటే కూడా రావురమేష్ పాత్రతో సినిమాను వినోదాత్మకంగా ముగించిన తీరు గురించే ప్రత్యేకంగా ముచ్చటించుకోవాలి. ‘అ ఆ’లోని కొన్ని నెగెటివ్ పాయింట్లన్నీ కూడా మనసులోంచి చెరిగిపోయి.. ఒక పాజిటివ్ ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేస్తాయి చివర్లో రావు రమేష్ డైలాగ్స్. ‘‘రోడ్డు వైడెనింగ్ లో సగం పోయిన బిల్డింగ్ లా ఉంది నా పరిస్థితి. ఉండటానికి పనికి రాదు. వదిలేయడానికి మనసొప్పదు’’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇందులో ఒకానొక హైలైట్.
పల్లెటూరి వాతావరణాన్ని తెరమీద అద్భుతంగా ఆవిష్కరించడమైతేనేం.. తిరిగి తన మార్కు చమత్కారం చూపించడమైతేనేం.. ‘అనసూయ కోసం’ పాటలో హీరోయిన్ ఒక్కో రోజును గడిపేస్తున్నట్లు అంకెల రూపాల్ని ఆర్ట్ వర్క్ ద్వారా చూపించడమైతేనేమి.. డ్రీమ్ సాంగ్స్.. సెట్టింగ్ సాంగ్స్ ఏమీ లేకుండా కథలో ఇమిడిపోయేలా పాటల్ని నడిపిస్తూ.. పాటలతోనూ కథను చెప్పడమైతేనేమి.. త్రివిక్రమ్ గత కొన్ని సినిమాలతో పోలిస్తే ‘అ ఆ’ భిన్నంగా కనిపిస్తుంది. మళ్లీ ఒకప్పటి త్రివిక్రమ్ అభిరుచి.. భావుకత ఇందులో కనిపిస్తాయి. ‘అ ఆ’లో నెగెటివ్స్ లేవని కాదు కానీ.. వాటిని మరిపించే పాజిటివ్స్ చాలానే ఉన్నాయి.
నటీనటులు:
ఆనంద్ విహారి నితిన్ కెరీర్లోనే అత్యంత పరిణతితో కూడిన పాత్ర. ఆ పాత్రకు తగ్గ పరిణతి నటనలోనూ చూపించాడు నితిన్. ఈ సినిమాలో అతను కొత్తగా కనిపిస్తాడు. కొంచెం హడావుడి ఉన్న పాత్ర కాబట్టి సమంత తన స్క్రీన్ ప్రెజెన్స్ తో నితిన్ ను డామినేట్ చేసినట్లు కనిపిస్తుంది కానీ.. సైలెంటుగానే మనసు దోస్తాడు నితిన్. అతడి కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫామెన్సెస్ అనడంలో సందేహం లేదు. తన తండ్రికి సంబంధించిన విషాదాన్ని.. తన కుటుంబ బాధ్యతను మోస్తున్న భావనను నితిన్ తన కళ్లతో పలికించాడు.
ఇక సమంత అనుకున్నట్లే అదరగొట్టేసింది. ఆమె హావభావాలు.. చిలిపి నటన కట్టిపడేస్తాయి. సమంత పాత్ర.. ఆమె నటన.. ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. వీళ్లిద్దరి తర్వాత చెప్పాల్సింది రావు రమేష్ గురించే. మిగతా పాత్రలకు ప్రత్యామ్నాయాలున్నాయేమో కానీ.. పల్లం వెంకన్న పాత్రను మాత్రం రావు రమేష్ మాత్రమే చేయగలడు అనిపిస్తుంది. తనకు మాత్రమే సాధ్యమైన సెటైరిక్ డైలాగ్ డెలివరీ.. బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేశాడు రావు రమేష్. నదియా ‘అత్తారింటికి దారేది’ తరహాలోనే మరో గుర్తుండిపోయే పాత్రలో సహజంగా నటించింది. నరేష్ చాన్నాళ్ల తర్వాత కీలకమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. నరేష్-సమంత కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బావున్నాయి. కొత్తమ్మాయి అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా చేసింది. అవసరాల శ్రీనివాస్.. ప్రవీణ్.. ఈశ్వరి.. అజయ్.. అనన్య.. పోసాని.. వీళ్లందరూ పాత్రలకు తగ్గట్లు బాగా నటించారు.
సాంకేతికవర్గం:
‘అ ఆ’కు సాంకేతిక హంగులన్నీ చక్కగా కుదిరాయి. మిక్కీ జే మేయర్ చక్కటి సందర్భోచితమైన పాటలిచ్చాడు. సినిమాలో అవి బాగా ఇమిడిపోయాయి. ఆడియోలో కంటే తెరమీద మరింత బాగా అనిపిస్తాయి సాంగ్స్. త్రివిక్రమ్ చాన్నాళ్ల తర్వాత పాటల కోసం పాటలు కాకుండా సందర్భోచితంగా పాటలు పెట్టాడు. మిక్కీ నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఇక త్రివిక్రమ్ ఏరికోరి తమిళ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యంను ఎంచుకోవడానికి కారణమేంటో తెరమీద కనిపిస్తుంది. సినిమాకు మేజర్ హైలైట్లలో ఛాయాగ్రహణం ఒకటి. పల్లెటూరి అందాల్ని వాస్తవంగా ఉన్నదానికంటే బాగా ఆవిష్కరించింది నటరాజ్ కెమెరా. చాలా విజువల్స్ అలా మైండ్లో ప్రింట్ అయిపోతాయి. కలర్స్.. థీమ్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి. ఆర్ట్ వర్క్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ప్రతిపాటలోనూ కళా దర్శకుడి నైపుణ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ‘అనసూయ కోసం’ పాటలో ఆర్ట్ వర్క్ సూపర్బ్. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో బాగా ఖర్చు పెట్టారు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపిస్తుంది.
ఇక రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ మళ్లీ తన కలం పదును చూపించాడు. ‘‘వాచ్ ఉన్న ప్రతివాడూ టైమ్ వస్తుంది అనుకుంటాడు. కానీ టైం తెలుస్తుంది అంతే’’.. ‘‘నువ్వు దింపేంత బరువేం కాదులే.. నేనే వెళ్లిపోతా’’.. ‘‘మాట్లాడకుండా ఉంటే ముని అంటారనుకున్నాను.. కానీ మూగోడిగా ముద్ర వేసేశారు’’ లాంటి డెప్త్ డైలాగులకు తోడు.. పంచ్ డైలాగ్స్ కూడా బాగానే పేలాయి. చివర్లో రావు రమేష్ కు రాసిన డైలాగులైతే అదిరిపోయాయి. దర్శకుడిగా ఓ కంప్లీట్ ఫిల్మ్ తీయలేకపోయాడు కానీ.. ఒక మంచి సినిమానే అందించాడు త్రివిక్రమ్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో మిస్సయినట్లు కనిపించిన అతడి చమత్కారం.. మళ్లీ ఇందులో కనిపించింది. అక్కడక్కడా కొన్ని అనవసర సన్నివేశాలు.. ద్వితీయార్ధంలో కొంత సాగతీత మినహాయిస్తే.. ఓవరాల్ గా త్రివిక్రమ్ బాగానే ఎంటర్టైన్ చేశాడు.
చివరగా: అందంగా.. ఆహ్లాదంగా.. ‘అఆ’
రేటింగ్- 3/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre