Begin typing your search above and press return to search.

రంగస్థలం మీద బుక్ రాస్తున్నారంటగా..

By:  Tupaki Desk   |   9 May 2018 1:36 PM GMT
రంగస్థలం మీద బుక్ రాస్తున్నారంటగా..
X
టాలీవుడ్ రూపు రేఖల్లో మార్పు ఎంతగా వస్తోంది అంటే.. మళ్లీ వెనక్కి వెళ్లినా కూడా అభిమానులకు సినిమా నచ్చేలా మారుతోంది. కంటెంట్ లో కాదు లెండి. పాత ఫార్మాట్ లో వచ్చే కథలను కాస్త కొత్తగా ప్రజెంట్ చేస్తే మట్టిని చూడటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. మాస్ ప్రేక్షకులు ప్రతి సారి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలను ఇష్టపడుతున్నారు. క్లాస్ ఆడియెన్స్ నుంచి మల్టీ ప్లెక్స్ ల వరకు కూడా సినిమాలకు ఆదరణ దక్కుతోంది.

అందుకు ఉదాహరణగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం అని చెప్పుకోవచ్చు. మెగా పవర్ స్టార్ట్ హోదా ఉన్న రామ్ చరణ్ ఓ మట్టి మనిషిగా కనిపించి పల్లెటూరి వాతావరణంలో కరెక్ట్ కనిపంచాడు. దర్శకుడు సుకుమార్ కూడా సినిమాను అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు ఈ ఏడాది నచ్చిన మొదటి సినిమా కావడంతో సినిమా దాదాపు 200 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో చేరింది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా అంతా గొప్ప విజయాన్ని అందుకోవడం అంటే మాములు విషయం కాదు. దాని వెనుక చిత్ర యూనిట్ పడిన కష్టం చాలా పెద్దది.

అయితే సినిమాకు సంబంధించిన ఒక పుస్తకాన్ని రెడీ చేస్తున్నట్లు ఓ సీనియర్ జర్నలిస్ట్ తెలియజేయడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా తెరకెక్కిన విధానం తో పాటు గోదావరి పరిసర ప్రాంత వాతావరణం కళ్లకు కట్టినట్టుగా ఎలా చూపించారు అనే విషయం పై పూర్తి వివరణను ఆ పుస్తకంలో తెలుపనున్నారని తెలిసింది. ఇప్పటికే బాహుబలి సినిమాకు సంబంధించిన శివగామి పాత్ర పేరుతో ఒక పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే. ఇది కూడా ఒక విశిష్టత కలిగిన చిత్రం కలవడంతో బుక్ రూపంలో వస్తే బావుంటుందని అంతా అనుకుంటున్నారు.