Begin typing your search above and press return to search.
స్టార్ హీరో ఇంటి ముందు లేడీ రచ్చ
By: Tupaki Desk | 7 April 2019 11:00 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కు ఊహించని అనుభవం ఎదురైంది. వరుణ్ ధావన్ కొంత కాలంగా నటాషా దలాల్ తో ప్రేమలో ఉన్నాడు. ఆమెతో పెళ్లికి కూడా రెడీ అవుతున్నాడు. అయితే తాజాగా వరుణ్ ధావన్ ఇంటి ముందు ఓ లేడి అభిమాని రచ్చ చేయడం.. నీ ప్రియురాలిని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడం దుమారం రేపింది. అయితే సదురు లేడి అభిమానిపై కేసుపెట్టిన వరుణ్.. ఆమె అలా ఎందుకు ప్రవర్తించిందనే దానిపై మాత్రం మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కలంక్ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న వరుణ్ ధావన్ అలిసిపోయి రాత్రి ఇంటికి వచ్చాడు. సదురు లేడి అభిమాని అప్పుడే వచ్చి వరుణ్ ను కలవాలని తనను తాను గాయపరుచుకొని గొడవ చేసింది. వరుణ్ ను కలవనీయకపోతే అతడి ప్రియురాలు నటాషా దలాల్ ను చంపేస్తానని బెదిరించింది.
దీంతో వరుణ్ ఇంటి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని శాంతా క్రజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా.. వరుణ్ ధావన్ నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
కరుణ్ జోహార్, సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ‘కలంక్’ చిత్రంలో ప్రస్తుతం వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. ఏప్రిల్ 17న విడుదలయ్యే ఈ చిత్రంలోని ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో అభిమానులను కలవలేకపోయాడని.. లేడి అభిమానికి ఎంత చెప్పినా వినిపించుకోకుండా రచ్చ చేసిందని మీడియాకు వరుణ్ సిబ్బంది తెలిపారు.