Begin typing your search above and press return to search.

'బిగ్‌ బాస్‌'కి పోటీగా మరో రియాలిటీ షో రాబోతోందా...?

By:  Tupaki Desk   |   9 July 2020 12:30 PM GMT
బిగ్‌ బాస్‌కి పోటీగా మరో రియాలిటీ షో రాబోతోందా...?
X
బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ షో లలో 'బిగ్ బాస్' ఒకటి. ఎన్నో వివాదాల నడుమ తెలుగులో ప్రసారం అయిన ఈ షోకు ఫస్ట్ సీజన్‌ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు వివాదాలు కూడా చెలరేగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో సినిమాలతో పాటు సీరియల్స్ మరియు ఇరత షోలు కూడా ఆగిపోయాయి. గత నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ మరియు టీవీలను ఆశ్రయిస్తున్నారు. అయితే అన్ని ఛానల్స్ లో ఇప్పటికే షూట్ చేసిన ఫుటేజీ టెలికాస్ట్ చేసేయడంతో అవే రిపీటెడ్ గా ప్రసారం చేస్తున్నారు. చూసిన కంటెంట్ నే మళ్ళీ చూడటానికి వీక్షకులు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో ఇటీవల షూటింగ్స్ అనుమతులు లభించాయి. దీంతో కరోనాని సైతం లెక్క చేయకుండా కొన్ని సీరియల్స్.. షోలు షూటింగ్ స్టార్ట్ చేసేశాయి. ఇక 'బిగ్‌ బాస్‌ హౌస్' కూడా స్మాల్ స్క్రీన్ అపి మరోసారి సత్తా చాటడానికి రెడీ అవుతోందట. అయితే ఇప్పుడు 'బిగ్‌ బాస్‌' కి పోటీగా మరో రియాలిటీ షో రాబోతోందట.

'బిగ్‌ బాస్‌'కి పోటీని ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయట. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానల్ తెలుగులో ఒక రియాలిటీ షోకి ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి షోస్ కి ఆదరణ లభిస్తుందని ఆలోచిస్తున్న సదరు ఛానల్ వారు ఈ షో తో 'బిగ్‌ బాస్‌'ని వెనక్కి నెట్టొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట. ఇదే సమయంలో 'బిగ్‌ బాస్‌ 4' కి 'కింగ్' నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారనే న్యూస్ బయటకి వస్తుండటంతో కొత్తగా స్టార్ట్ చేయబోయే రియాలిటీ షో కోసం ఓ స్టార్ హీరోని హోస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో కొత్త రియాలిటీ షోకి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండను హోస్ట్ గా చేయమని అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో 'బిగ్ బాస్ 4' హోస్ట్ గా విజయ్ దేవరకొండ అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు లేటెస్టుగా వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.