Begin typing your search above and press return to search.

బ్యాంకాక్ అడ‌వుల్లో పుష్ప‌రాజ్ పులితో పోరాటం?

By:  Tupaki Desk   |   17 Oct 2022 3:46 AM GMT
బ్యాంకాక్ అడ‌వుల్లో పుష్ప‌రాజ్ పులితో పోరాటం?
X
అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' విడుదలై దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. ఇప్పటికీ పుష్ప పాట‌లు ఇందులో న‌టించిన తార‌లు ట్రెండింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు రెండవ భాగం, పుష్ప: ది రూల్ లో పుష్పరాజ్ ఐకానిక్ రోల్ ఇంకెలా మారుతుందో చూడాల‌న్న ఉత్కంఠ నెల‌కొంది. త‌గ్గేదేలే! అంటూ ఈసారి రేంజును అమాంతం పెంచేందుకు సుకుమార్ టీమ్ చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకుని స్క్రిప్టును రీరైట్ చేసింది. అభిమానులు ఊపిరి పీల్చుకునేందుకు ఛాన్స్ లేని గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ నేరేష‌న్ తో పార్ట్ 2 ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే జూన్ లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో, అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు ధృవీకరించారు. అలాగే పుష్ప 2 విడుదల ప్రణాళికలను వెల్లడించాడు డిసెంబర్ 2021లో పుష్ప విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ విరామంలో ఉన్నాడు. ఈ చిత్రం దక్షిణాది నుండి వచ్చిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా పుష్ప‌1 నిలిచింది. ప్రస్తుతం షూటింగ్‌ ప్రారంభించబోతున్నాం.. వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని ఆశిస్తున్నాం అని బ‌న్ని అన్నారు.

పుష్ప గురించి అల్లు అర్జున్ తాజా అప్ డేట్ ప్ర‌కారం.. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ స్టూడియోస్ లో బ‌న్నీపై ఫోటోషూట్ జ‌రిగింది. మ‌రోవైపు బ్యాంకాక్- శ్రీ‌లంక అడ‌వుల్లో అరుదైన లొకేష‌న్ల‌ను వెతికేందుకు చిత్ర‌బృందం ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలిసింది. బ్యాంకాక్ అడ‌వుల్లో పులితో బ‌న్ని భీక‌ర‌మైన ఫైట్ ని చిత్రీక‌రిస్తార‌ని కూడా లీక్ అందింది. ఇది సీజీలో తెర‌కెక్కినా కానీ.. రియ‌లిస్టిక్ గా ఉండేందుకు చాలా ఎక్కువ కేర్ తీసుకోనున్నార‌ని తెలిసింది. మొత్తానికి సీక్వెల్ స్టార్ట‌యింది. డిసెంబ‌ర్ 2023లో విడ‌ద‌ల‌య్యేందుకు ఛాన్సుంద‌ని టాక్ వినిపిస్తోంది.

పుష్ప: ది రైజ్ లో రష్మిక మందన్న క‌థానాయిక‌. పోలీసు అధికారి భన్వర్ సింగ్ షికావత్ కు పుష్పరాజ్ గుణపాఠం చెప్పడంతో మొదటి భాగం ముగిసింది. ఆ తర్వాత రక్తసిక్తమైన చేతులతో రష్మిక శ్రీవల్లిని పెళ్లి చేసుకున్నాడు. రెండవ భాగం పుష్పరాజ్ వ‌ర్సెస్ భన్వర్ సింగ్ మధ్య వార్ నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఈ చిత్రం యొక్క రెండవ భాగంలో పుష్ప‌రాజ్ వ‌ర్సెస్ భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ వార్ ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. పార్ట్ 2లో అది మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా.

జగదీష్ ప్రతాప్ బండారి- రావు రమేష్- అనసూయ భరద్వాజ్- అజయ్ ఘోష్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రల్లో క‌నిపిస్తారు. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ -, ఎడిటర్లు కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ..మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సాంకేతిక బృందంలో భాగం.

పుష్ప 2 బాలీవుడ్ ఎ-లిస్టర్ ?

పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ న‌టించ‌నున్నార‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. పుష్ప సీక్వెల్ మొదటి చిత్రం కంటే చాలా ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెర‌కెక్క‌నుంది. సీక్వెల్ బడ్జెట్ దాదాపు రెండింతలు పెంచారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో బాలీవుడ్ ఎ-లిస్టర్ ఒకరు నటిస్తున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పుష్ప 2లో ఒక బాలీవుడ్ నటుడు (అర్జున్ కపూర్) విలన్ గా నటిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని ప్రూవ్ అయ్యింది. పుష్ప సీక్వెల్ లో ఫహద్ ఫాసిల్ సిస‌లైన‌ విలన్. కానీ పుష్ప 2లో అల్లు అర్జున్ ని ఢీకొట్టేందుకు ఒక ప్రముఖ బాలీవుడ్ ఎ-లిస్టర్ చేరేందుకు ఆస్కారం లేక‌పోలేదని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల గాడ్ ఫాదర్ లో చిరంజీవికి స‌పోర్టింగ్ పాత్ర‌లో సల్మాన్ ఖాన్ అద‌ర‌గొట్టారు. అదే త‌ర‌హాలో ఎ-లిస్టర్ పొడిగించిన అతిథి పాత్రలో కనిపిస్తారని సోర్సెస్ చెబుతున్నాయి. సల్మాన్ పుష్ప 2లో చేరే అవకాశం లేక‌పోలేదు. కానీ ఇంకా ఏదీ అధికారికంగా క‌న్ఫామ్ కాలేదు అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.