Begin typing your search above and press return to search.

యాచ‌కురాలు..సంచ‌ల‌న‌ గాయ‌ని రాణూ బ‌యోపిక్!

By:  Tupaki Desk   |   26 Sep 2019 1:30 AM GMT
యాచ‌కురాలు..సంచ‌ల‌న‌ గాయ‌ని రాణూ బ‌యోపిక్!
X
బ‌యోపిక్ ల ట్రెండ్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. బాలీవుడ్‌.. టాలీవుడ్.. ఇలా ఏ ఇండ‌స్ట్రీని చూసినా ఏదో ఒక బ‌యోపిక్ మాటే వినిపిస్తోందిప్పుడు. ముంబై ప‌రిశ్ర‌మ‌లో మాత్రం రోజుకో బ‌యోపిక్ తెర‌పైకొస్తోంది. తాజాగా రాణూ మోండ‌ల్ బ‌యోపిక్ కి రంగం సిద్ధ‌మైంది. కోల్ కొతా రైల్వే ప్లాట్ ఫామ్ పై యాచ‌కురాలిగా జీవ‌నం వెల్ల‌దీస్తున్న ఈ ప్ర‌తిభావ‌ని ల‌తా మంగేష్క‌ర్ పాడిన ఓ గీతాన్ని అచ్చు ఆమె త‌ర‌హాలోనే ఆల‌పించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వీడియోతో పాపుల‌ర్ అయిన రాణూ మోండ‌ల్ ప్ర‌తిభ‌ను గుర్తించిన క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిమేష్ రేష‌మ్మియా ఆమెకు తొలిసారి పాట పాడే అవ‌కాశాన్నిచ్చి సెల‌బ్రిటీని చేశాడు.

దాంతో బాలీవుడ్‌ లో ఇప్పుడు రాణూ మోండ‌ల్ హాట్ ఫేవ‌రేట్ గా మారింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఆమె జీవితం ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచింది. టైమ్ ఎవ‌రిని ఎప్పుడు ఎలా అంద‌ల‌మెక్కిస్తుందో కాలం నిర్ణ‌యిస్తుంద‌ని, ఆ స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు వేచి వుండాల‌ని దానికి రాణూ జీవిత‌మే గొప్ప ఉదాహ‌ర‌ణ అని బాలీవుడ్ సెల‌బ్రిటీలు చెబుతున్నారు. అయితే ఆమె రైల్వే ప్లాట్ ఫామ్ నుంచి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు జ‌ర్నీ నేప‌థ్యాన్ని జీవిత క‌థ‌గా మ‌లుస్తూ బెంగాలీ ద‌ర్శ‌కుడు రిషీకేష్‌ ఏకంగా బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నాడు.

ఈ బ‌యోపిక్ లో రానూ మోండ‌ల్ పాత్ర‌లో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారం ద‌క్కించుకున్న సుదీప్తా చ‌క్ర‌వ‌ర్తి న‌టించ‌బోతోంది. `రాణూ మోండ‌ల్ బ‌యోపిక్ లో న‌టించ‌మ‌ని ద‌ర్శ‌కుడు నాకు ఆఫ‌ర్ ఇచ్చారు. స్క్రిప్ట్ విన్న త‌రువాతే నా నిర్ణ‌యం చెబుతాన‌ని చెప్పాను` అని సుదీప్తా చ‌క్ర‌వ‌ర్తి జాతీయ మీడియాకు వెల్ల‌డించింది. ఇందులో రాణూ క‌థ‌తో పాటే.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఏ స్థాయిలో వుందో ఈ చిత్రంలో చూపించ‌బోతున్నారు. సింగింగ్ సెన్సేష‌న్ గా మారిన రాణూ మోడ‌ల్ బ‌యోపిక్ అక్టోబ‌ర్ లో ప్రారంభం కాబోతోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని రిషీకేష్ ప్లాన్ చేస్తున్నారు. ల‌తా మంగేష్క‌ర్ బ‌యోపిక్ లేదు కానీ రాణూ బ‌యోపిక్.. తెర‌కెక్కుతోంది. ఇది కాస్త విచిత్ర‌మే. ఎన్నో వంద‌ల గీతాలు ఆల‌పించి అవార్డులు రివార్డులు అందుకున్నా ల‌తాజీ బ‌యోపిక్ గురించి ఎవ‌రూ ఆలోచించ‌లేదు. కానీ ఎంతో ఎమోష‌న‌ల్ లైఫ్ జ‌ర్నీ ఉంది కాబ‌ట్టి రాణూ జీవిత‌ క‌థ‌ను సినిమాగా చూపించ‌బోతున్నార‌న్న‌మాట‌.