Begin typing your search above and press return to search.
ఈ బాలీవుడ్డోళ్లకు వేరే ఐడియాలే లేవా?
By: Tupaki Desk | 10 July 2016 4:28 AM GMTబాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి ఇప్పుడు కొత్త కథలు అనేవి రావట్లేదు. అయితే మసాలా సినిమాలు. లేకపోతే ఎవరివైనా నిజజీవితపు బయోపిక్స్. లేదంటే సూపర్ హీరోల కథలు. ఈ మూడు ఫార్మాట్లనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇవి దాటి ఏదైనా సినిమా అంటే మాత్రం.. కాస్త కష్టంగానే ఉంది అక్కడ.
కంటెంట్ యావరేజ్ గా ఉన్నా కూడా ఊహించని రీతిలో ''బాఘీ'' సినిమాతో కమర్షియల్ స్పిన్నింగ్ సినిమాను తీశాడనే పేరును తన ఖాతాలో వేసుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఆ ఊపులో ఇప్పుడు ఏకంగా సూపర్ హీరోగా మారిపోయాడు. ''ఎ ఫ్లయింగ్ జాట్'' అనే సినిమాలో మనోడు ఒక సూపర్ హీరో. ఇతగాడికి విలన్ గా నటిస్తున్న హాలీవుడ్ వ్రెజ్లింగ్ స్టార్ నాథన్ జోన్స్ కూడా మరో సూపర్ హీరోగా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తూ కొత్తగా ఏమీ అనిపించదు కాని.. అమెరికా వాళ్లు క్రియేట్ చేసిన రకరకాల సూపర్ హీరోల తాలూకు పవర్లను కాపీ కొట్టేసి.. వారి డ్రస్సులన్నీ వాడి ఒక కొత్త డ్రస్ తయారుచేసి.. ఆల్రెడీ 'క్రిష్' అనే కిచడీ తీస్తున్నారుగా.. దానికి సీక్వెల్ టైపులో ఉందీ సినిమా.
అసలే హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియా మార్కెట్ కోసం ఎగబడుతున్న వేళ.. మనోళ్ళ ఇలా సూపర్ హీరోల పేరుతో స్ర్కాప్ ఐడియాలన్నీ వెండితెరపై వార్చి వడ్డిస్తే.. జనాలు నవ్వుకుంటారు బాసూ. కొత్త ఐడియాలను వెతకండి.. లేదా ఇలాంటి హీరోలను తయారు చేయడం మానేయండి. ప్లీజ్.