Begin typing your search above and press return to search.
ప్రభాస్ మూవీలో ఛాన్స్ అంటూ.. డబ్బులు దొబ్బేసిన గ్యాంగ్!
By: Tupaki Desk | 24 Jan 2021 11:35 AM GMTసినిమా ఇండస్ట్రీ అంటే.. అదో కలల ప్రపంచం. అందులో విహరించాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. అయితే.. వారిలో 5 శాతం మందికి ఛాన్స్ వస్తే.. ఒకటో రెండో శాతం మంది సక్సెస్ అవుతుంటారు. మిగిలిన వారిలో చాలా మంది అవకాశాలు రాక వెనుతిరిగితే.. మరికొందరు మోసపోయి రిటర్న్ అవుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ముంబైలో జరిగింది.
చిత్ర పరిశ్రమలో పలురకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని నటులను, స్టార్ హీరోలతో డేట్స్ ఇప్పిస్తామంటూ నిర్మాతలను మోసం చేస్తూ ఉంటారు. సినిమాను పిచ్చిగా ప్రేమించే వారు.. తేలిగ్గా ఈ మాయలో పడుతుంటారు. తాజాగా.. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తామంటూ ఏకంగా ఆఫీస్ తెరిచి కొందరిని మోసం చేసింది ఓ ముఠా.
విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ప్రభాస్ మూవీలో నటించే అవకాశం ఉందని ఓ ప్రొడక్షన్ హౌస్ పేరిట ప్రకటిన విడుదల చేశారు మోసగాళ్లు. ఛాన్స్ కావాలంటే.. ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసిన అమాయకులు.. అడిగినంత డబ్బు కట్టి పేర్లు నమోదు చేసుకున్నారు.
ముందూ వెనకా ఆలోచించుకోకుండా డబ్బు ముట్టజెప్పిన వారికి త్వరలోనే మీకు మెసేజ్ వస్తుందని చెప్పారట. షూట్ కు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారట. దీంతో.. సంబరపడిపోయిన అమాయకులు ఎదురు చూపులు మొదలు పెట్టారట. ఎంత కాలం అవుతున్నా.. మెసేజ్ రాకపోవడంతో ఆఫీసుకు వెళ్లి అడిగారు. దీంతో అసలు విషయం అప్పుడు అర్థమైందట.
దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుండి రూ.ఐదు వేల నుండి పది వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.