Begin typing your search above and press return to search.
ఆర్ఆర్ఆర్ టీజర్ కు మంచి సందర్బం ఖరారు
By: Tupaki Desk | 14 July 2021 3:30 PM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రేపు సినిమా మేకర్స్ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. మేకింగ్ వీడియో కోసం నందమూరి మరియు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రియల్ లైఫ్ లో రీల్ లో కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు మంచి స్నేహితులు. కనుక వచ్చే ఫ్రెండ్ షిప్ డేకు ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ను అభిమానులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 1 వ తారీకున స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఆర్ ఆర్ ఆర్ మొదటి టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
ఇప్పటి వరకు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల విడి విడి వీడియోలను మేకర్స్ విడుదల చేశారు. కాని మొదటి సారి ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా ఒక మంచి టీజర్ ను విడుదల చేసి సినిమా పై అంచనాలు మరింతగా పెంచాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ను అక్టోబర్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు సార్లు మార్పులు జరిగాయి. కనుక ఇప్పటికి అయినా మార్పులు లేకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి అక్టోబర్ లోనే సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న కారణంగా.. అలాగే స్నేహితుల దినోత్సవం అనేది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే అంశం కనుక ఆ రోజున టీజర్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజున టీజర్ విడుదల చేయడం వల్ల సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వడంతో పాటు సినిమా విడుదల తేదీ విషయంలో మరింత స్పష్టత ఇచ్చినట్లు అవుతుందని కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల పై ఇప్పటికే టీజర్ కట్టింగ్ జరుగుతోంది. ఇక రేపు మేకింగ్ వీడియో మరియు దాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి పెద్దన్న కీరవాణి అంచనాలను అందుకుంటాడా అనేది చూడాలి.