Begin typing your search above and press return to search.

అల బంటు ఫైట్‌ ను అచ్చు గుద్దేశారు

By:  Tupaki Desk   |   19 Sept 2020 9:30 PM IST
అల బంటు ఫైట్‌ ను అచ్చు గుద్దేశారు
X
సోషల్‌ మీడియాలో కారణంగా మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఫైట్‌ ను అంతకు ముందు అరవింద సమేత ఫైట్‌ ను చిన్న పిల్లలు దించేసి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్నారు. ఇప్పుడు అల వైకుంఠపురంలో సినిమాలోని మొదటి ఫైట్‌ ను చేసిన కొందరు పిల్లలు నెట్టింట సందడి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆ వీడియోను థమన్‌ షేర్‌ చేయడంతో మరింతగా ఆ విషయమై వైరల్‌ అవుతోంది. అల్లు అర్జున్‌ తో త్రివిక్రమ్‌ ఎలా అయితే చేయించాడో అలాగే ఈ వీడియోలో పిల్లు చేశారు.

నవదీప్‌ తో ఉన్న చున్నీ ఫైట్‌ సీన్‌ ను బన్నీ అద్బుతంగా చేశాడు. ఆ ఫైట్‌ కంపోజింగ్‌ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. చాలా స్టైలిష్‌ గా అందరిని ఆకట్టుకునేల ఉంటుంది. ఇప్పుడు అంతే స్టైలిష్‌ గా ఉన్నపాటి కొద్ది వనరులు ఉపయోగించుకుని పిల్లలు చేసిన ఈ ప్రయత్నంను నెటిజన్స్‌ అభినందిస్తున్నారు. థమన్‌ ఈ వీడియోను షేర్‌ చేసి కుమ్మేశారు.. ఇప్పుడే ఈ వీడియోను అల వైకుంఠపురంలో సినిమా యూనిట్‌ సభ్యులందరికి కూడా పంపించాను అంటూ ట్వీట్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే వస్తుంటాయి. కాని చాలా పర్ఫెక్షన్‌ తో ఈ వీడియోను చేసినట్లుగా దీనిని చూస్తే అనిపిస్తుంది.