Begin typing your search above and press return to search.
రవితేజకు ఓ హోం బ్యానర్
By: Tupaki Desk | 8 July 2021 6:32 AM GMTఈమద్య కాలంలో ప్రతి హీరో కూడా సొంతంగా నిర్మాణ సంస్థలు ప్రారంభిస్తున్నారు. కొందరు తమ సన్నిహితులతో లేదా కుటుంబ సభ్యులతో బ్యానర్ లు ఏర్పాటు చేయించి ఆ బ్యానర్ ల్లో ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇతర నిర్మాణ సంస్థల్లో చేసినా కూడా తమ బ్యానర్ ను భాగస్వామ్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు అదే పద్దతిని ఫాలో అవుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ తన అన్న కళ్యాన్ రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇతర నిర్మాతలతో కళ్యాణ్ రామ్ ను భాగస్వామ్యం చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తన యూవీ క్రియేషన్స్ తో మరియు మహేష్ బాబు తన నిర్మాణ సంస్థను భాగస్వామ్యం చేస్తున్నాడు. ఇప్పుడు అదే దారిలో రవితేజ కూడా నడిచేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
రవితేజ సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయకుండా తన మేనేజర్ శ్రీనివాస్ తో బ్యానర్ ఏర్పాటు చేయించాడు. రవితేజకు సుదీర్ఘ కాలంగా సన్నిహితంగా ఉంటూ వస్తున్న శ్రీనివాస్ పలు సినిమాల్లో కనిపించాడు కూడా. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారేందుకు సిద్దం అయ్యాడు. రవితేజ ప్రోత్సాహంతోనే సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ముందు ముందు తన సినిమాల నిర్మాణంలో శ్రీనివాస్ ను భాగస్వామ్యం చేసుకోవాలంటూ రవితేజ అడుగుతున్నాడట. శ్రీనివాస్ తనతో సుదీర్ఘ కాలంగా ఉన్నందుకు ఆయనకు సాయం చేయడంతో పాటు తనకు కూడా లాభంగా రవితేజ భావిస్తున్నాడని తెలుస్తోంది.
రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల అన్ని విషయాలను కూడా శ్రీనివాస్ చూసుకుంటాడని.. డేట్ల నుండి పారితోషికం వరకు అన్ని రకాలుగా రవితేజకు సుదీర్ఘ కాలంగా తోడుగా ఉంటున్న శ్రీనివాస్ ను ప్రోత్సహిస్తూ నిర్మాతగా మార్చేందుకు రవితేజ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ముందు ముందు ఇతర హీరోల మాదిరిగా రవితేజ కూడా తన సొంత బ్యానర్ గా శ్రీనివాస్ బ్యానర్ ను మార్చుకుని వరుసగా అందులోనే సినిమాలు చేస్తాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.
బయట బ్యానర్ లో సినిమా చేసినా కొంత మేరకు పార్టనర్ షిప్ ను కలిగి ఉండేలా ముందస్తు ఒప్పందం చేసుకుంటున్నారు. రవితేజ కూడా ముందు ముందు తన సినిమాలకు శ్రీనివాస్ ను ఒక నిర్మాతగా మార్చే అవకాశం ఉంటుందేమో చూడాలి. హీరోలు మరియు దర్శకుల ప్రోత్సాహంతో ఈమద్య కాలంలో పలువురు నిర్మాతలుగా మారారు. ఇప్పుడు రవితేజ సాయంతో శ్రీనివాస్ నిర్మాతగా మారి ఎంత మేరకు సక్సెస్ ను దక్కించుకుంటాడో చూడాలి.