Begin typing your search above and press return to search.
పాత్ర లేకపోయినా కాజల్ కు భారీ పారితోషకం?
By: Tupaki Desk | 28 April 2022 7:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' ఈనెల 29న ఘనంగా విడుదలవుతోంది. రామ్ చరణ్- పూజా హెగ్డే ఇందులో జంటగా నటించగా.. చిరుకి పెయిర్ గా కాజల్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇటీవలే ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ సన్నివేశాలను అధికారికంగా తొలగించారు. దీనిపై కాజల్ ఫీలయ్యారని కూడా కథనాలొచ్చాయి. కొరటాల కోపంతో నే తనని తొలగించాడన్న ప్రచారం కూడా సాగిపోయింది.
కానీ ఇవేవీ నిజాలు కావని టీమ్ చెబుతోంది. వాస్తవానికి దర్శకుడు కొరటాల శివ సీరియస్-మైండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కాజల్ తో చిరు రొమాన్స్ ని అలాగే కాజల్ పాత్రలో వినోదాన్ని మేళవించాలని అనుకున్నారు. అలా ఊహించుకుని చిరు-కాజల్ సన్నివేశాలు రాసుకున్నానని కొరటాల తెలిపారు.
అయితే ఈ చిత్రంలో కాజల్ ఇప్పుడు లేదు. తెరపై కనిపించదు. కాజల్ వివాహం అనంతరం ఫ్రెగ్నెన్సీ వగైరా కారణాలతో సంబంధం లేకుండా.. కాలక్రమేణా సినిమా నిడివి తగ్గడానికి కాజల్ పాత్రను తొలగించారు.
అందాల చందమామ మొత్తం ఐదు రోజులు సినిమా కోసం షూట్ లో పాల్గొందిట. కాజల్ తన పాత్ర నుండి తప్పుకోవాలనే నిర్ణయం ముందుగానే తీసుకున్నప్పటికీ ఆమెకు రూ. 1.5 కోట్లు చెల్లించారనేది తాజా గుసగుస. అయితే కాజల్ కి వచ్చిన నష్టమేంటీ? అంటే.. 'ఖైదీనంబర్ 150' తర్వాత చిరుతో క్రేజీ ఆఫర్ ఇది. చిరంజీవి కథానాయికగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమవడమే కాజల్ కు నష్టం. ఆమె అభిమానులు నిరుత్సాహానికి లోనవుతారు.
కానీ కొరటాల చిరు సినిమాపై ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నారని వారు అభినందిస్తున్నారు. అంతేకాకుండా మేకర్స్ అభిప్రాయానికి విలువిచ్చి కాజల్ సహృదయత చాటుకుంది. ఇక పారితోషికం ఇవ్వడం అనేది చిత్రబృందం నిలబెట్టుకున్న గౌరవంగా భావించాలి. కాజల్ ప్రస్తుతం భర్త గౌతమ్ కిచ్లు.. గారాల పట్టీ నీల్ తో ఆనందకర జీవనాన్ని సాగిస్తున్నారు.