Begin typing your search above and press return to search.
టీవీ నటి ఇంటికెళ్లి రచ్చ చేసిన బీటెక్ కుర్రాడు!
By: Tupaki Desk | 10 May 2019 5:00 AM GMTతమిళ టీవీ నటికి ఊహించని షాక్ తగిలింది. ఎప్పటిలానే నిద్ర లేచిన ఆమెకు అనుకోని రీతిలో ఎదురైన ఘటన ఆమెకు నోట మాట రాని విధంగా చేసింది. బీటెక్ చదివిన కుర్రాడు.. ఇంటి తలుపు తట్టి.. పెళ్లి చేసుకుంటానంటూ చేసిన హడావుడి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలోకి వెళితే..
తమిళంలో సక్సెస్ అయిన ఫేమస్ టీవీ సీరియస్ రాజారాణి ఫేం రితికా.. సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. ఆమె డబ్ స్మాష్.. టిక్ టాక్ యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంటాయి. చెన్నైలోని వడపళని దగ్గర్లో ఒక అపార్ట్ మెంట్ లో ఉంటారు. తాజాగా ఒక యువకుడు ఆమె నివాసం ఉండే అపార్ట్ మెంట్ లోకి జొరపడి.. ఆమె ఫ్లాట్ తలుపు తట్టారు. దీంతో.. ఆమె తండ్రి సుబ్రహ్మణి తలుపు తెరిచారు. ఇంట్లోకి ప్రవేశించిన అతడు.. రితికను పెళ్లి చేసుకుంటానని హడావుడి చేశారు.
దీంతో.. రితిక తండ్రికి.. అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరుగుతున్న రచ్చను గుర్తించిన పక్క ప్లాట్ వారు.. పోలీసులకు సమాచారం అందించటంతో వారు రంగంలోకి దిగారు. ఇంటికి వచ్చిన సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నటి ఇంటికి వచ్చి గొడవ చేసిన కుర్రాడ్ని గొబిచెట్టిపాళ్యానికి చెందిన భరత్ గా గుర్తించారు. బీటెక్ పూర్తి చేసిన అతడు ఉద్యోగం కోసం చెన్నై వచ్చినట్లుగా గుర్తించారు.
సొంతూరు వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్న అతగాడు.. చివర్లో రితిక ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో.. రితిక తనకెంతో ఇష్టమని.. ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే అడిగినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసుల విచారణలో ఉన్నారు. ఊహించని ఈ పరిణామానికి రితిక షాక్ లో ఉన్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.