Begin typing your search above and press return to search.
వరుణ్ వేటకు చిక్కే ఆ ముగ్గురు ఎవరు?
By: Tupaki Desk | 20 Jun 2021 7:30 AM GMTక్రిటికల్ గా గొప్ప ప్రశంసలొచ్చినా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం చాలా ఇంపార్టెంట్. ప్రశంసలొచ్చినా కలెక్షన్లు లేనిదే నిర్మాతలకు ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఇదే కోణంలో ఆలోచిస్తున్నారట. మ్యాసివ్ బ్లాక్ బస్టర్లతో నిర్మాతలకు బంపర్ లాభాలు తేవాలన్నదే అతడి ఆలోచన.
అతడి కెరీర్ లో ఫిదా- తొలి ప్రేమ-ఎఫ్ 2- గద్దలకొండ గణేష్ లాంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ప్రేమకథలతో విజయాలు అందుకున్నాడు. కానీ అంతకుమించి ఇంకేదైనా సాధించాలన్న తపనతో ఉన్నాడట. ప్రస్తుతం అతడు బాక్సింగ్ నేపథ్యంలో సీరియస్ యాక్షన్ డ్రామాలో నటిస్తుండడం వరుణ్ లోని విలక్షణతకు అద్దం పడుతోంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గని చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3లోనూ వరుణ్ నటిస్తున్నాడు. గనితో పోలిస్తే ఎఫ్ 3 పూర్తిగా కామెడీ.. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా అలరించనుంది.
ప్రస్తుతం కరోనా మహమ్మారీ వల్ల ఈ రెండు చిత్రాలు అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో అతడు ఎంపిక చేసే స్క్రిప్టులు సహా దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇకపై వరుసగా మూడు చిత్రాలు కేవలం అనుభవజ్ఞులైన సీనియర్ దర్శకులతో మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారట. దానివల్ల తన మార్కెట్ స్థాయిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వరుణ్ భావిస్తున్నారు. వరుణ్ వేటాడే ఆ ముగ్గురు దర్శకులెవరు? అన్నది వేచి చూడాలి.