Begin typing your search above and press return to search.

సర్జరీ టైమ్‌.. బాబాయి తర్వాత అబ్బాయికి

By:  Tupaki Desk   |   5 Nov 2021 8:30 AM GMT
సర్జరీ టైమ్‌.. బాబాయి తర్వాత అబ్బాయికి
X
వెండి తెరపై హీరోలను చూసిన సమయంలో ఆహా ఓహో అనుకుంటూ ఉంటాం.. దీనికే వారు కోట్లకు కోట్ల పారితోషికాలు తీసుకుంటున్నారా అనుకుంటూ చర్చించుకుంటాం. అయితే మనం వెండి తెరపై చూసేది ఒకటి.. వారు రియాల్టీగా కష్టపడేది మరోటి. ఒకప్పటి హీరోలు చిన్న చిన్న సన్నివేశాలకు కూడా డూప్‌ లపై ఆదారపడేవారు. కాని ఇప్పుడు మాత్రం హీరోలు డూప్ ల జోలికి వెళ్లడం లేదు. ఎంత పెద్ద షాట్స్ అయినా.. రిష్కీ సన్నివేశాలు అయినా కూడా డైరెక్ట్‌ ఎటాక్ అన్నట్లుగా ముందుకు దూకుతున్నారు. అందుకోసం తమను తాము సిద్దం చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోలు ఫిజిక్ విషయంలో అస్సలు పట్టింపు లేకుండా ఉండేవారు. కాని ఇప్పుడు హీరోలు సిక్స్ ప్యాక్‌.. ఎయిట్‌ ప్యాక్ అంటూ ఉన్నారు. ఇక హీరోలు అంతా కూడా ఇప్పుడు రెగ్యులర్ గా వర్కౌట్‌ లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. షూటింగ్స్ సమయంలో కొందరికి చిన్న చిన్న ప్రమాదాలు.. కొందరికి పెద్ద ప్రమాదాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొందరికి వర్కౌట్స్ చేసే సమయంలో చిన్న పాట ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల హీరోలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో సర్జరీలకు వెళ్తున్నారు. కొన్ని రోజుల క్రితం చిరంజీవి చేతికి సర్జరీ చేయించుకున్న విషయం తెల్సిందే. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. చిరంజీవి కోలుకుంటున్నారో లేదో బాలకృష్ణకు ఆపరేషన్ అంటూ వార్తలు వచ్చాయి. ఆయన ఆపరేషన్‌ అవ్వడం.. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అవ్వడం కూడా జరిగి పోయింది. బాలకృష్ణ కూడా కోలుకుంటున్నారని.. ఆయనకు పస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా బాలయ్య సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ కూడా ఆపరేషన్ చేయించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇటీవల వర్కౌట్స్ చేస్తున్న సమయంలో చిన్నపాటి ప్రమాదం జరిగిందట. దాంతో కుడి చేయికి గాయం అయ్యిందని.. దానికి గాను ప్రముఖ ఆసుపత్రిలో చిన్న ఆపరేషన్ జరిగిందని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ దీపావళి సందర్బంగా కొడుకులతో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. అందులో ఆయన కుడి చేయిని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అధికారికంగా ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్‌ అయితే లేదు కాని ఆ ఫొటోను చూసి మరియు ఎన్టీఆర్ సన్నిహితుల మాటలను బట్టి ఎన్టీఆర్‌ కు ఆపరేషన్‌ జరిగిందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్‌ నుండి క్లారిటీ కావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన ఎన్టీఆర్‌ ఇటీవలే ఎవరు మీలో కోటీశ్వరులు షో చివరి షెడ్యూల్ ను కూడా ముగించాడు. ఇక కొరటాల శివ సినిమా కోసం తన వెయిట్‌ ను లాస్ చేసుకునే పనిలో ఎన్టీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.