Begin typing your search above and press return to search.
స్వర బ్రహ్మ మళ్లీ విజృంభిస్తున్నాడుగా!
By: Tupaki Desk | 5 Nov 2022 1:30 AM GMTక్రేజీ హీరోయిన్ సమంత నటిస్తున్న తొలి మైథలాజికల్ రొమాంటిక్ డ్రామా 'శాకుంతలం'. కాలిదాసు విరచిత కావ్యం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సమంత కెరీర్ లో నటించిన తొలి 3డీ మైథలాజికల్ డ్రామా ఇది. భారీ సెట్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గుణ్ శేఖర్ భారీ సెట్టింగులతో అత్యంత సుందరమైన లొకేషన్ లలో ఈ మూవీని శాకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కించారు.
ఊహించని విధంగా రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేసుకున్నఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా వీఎఫ్ ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ప్రియంవదగా అనన్య నాగళ్ల, కన్వరిషిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, గౌతమిగా సీనియర్ హీరోయిన్ గౌతమి, మేనకగా మధుబాల, అసురుడిగా కబీర్ దుహన్ సింగ్, ప్రిన్స్ భరతగా అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ, ఇతక కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ నటించారు.
గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలమ గుణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మూవీని ముందు నవంబర్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ 3డీ ఫార్మాట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ మారడంతో రిలీజ్ డేట్ ని కూడా మార్చేశారు.
డబ్బింగ్ పనేలతో పాటు 3డీ వర్క్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలోనే చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే చిత్ర బృందం శుక్రావారం ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామంటూ వెల్లడించారు. ఈ మోషన్ వీడియోకు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత వన్నె తేవడమే కాకుండా గ్రాడియర్ ఫీల్ ని కలిగిస్తూ అంచనాల్ని పెంచేస్తోంది.
స్వర బ్రహ్మగా పురు తెచ్చుకున్న మణిశర్మ నేపథ్య సంగీతంలో స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే. ఆయన అందించిన సంగీతం ఖుషీ, పోకిరి, ఒక్కడు, ఇస్మార్ట్ శంకర్, మురారి వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు ప్రధాన ఎస్సెట్ గా నిలిచి ఆయా సినిమాల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది. గత కొంత కాలంగా తన ఫామ్ ని కోల్పోయిన మణిశర్మ 'శాకుంతలం'తో మళ్లీ తనదైన మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. 'శాకుంతలం' తాజా మోషన్ వీడియోకు మణిశర్మ అందంచిన నేపథ్య సంగీతం మణిశర్మ విజృంభించబోతున్నాడని క్లారిటీ ఇస్తుండంతో సామ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.