Begin typing your search above and press return to search.
సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన పాపులర్ నటి
By: Tupaki Desk | 21 Jan 2023 4:30 PM GMTక్వీన్ కంగన రనౌత్ ముక్కుసూటి వ్యవహారం చాలా మందికి గిట్టని సంగతి తెలిసిందే. అయినా తన వైఖరిని మార్చుకోవడానికి భయపడి వెనకాడేందుకు ఎప్పుడూ క్వీన్ సిద్ధంగా ఉండదు. ఏటికి ఎదురెళ్లడం కొండను ఢీకొట్టడం తనకు అలవాటు. ఇప్పుడు ఏకంగా తన ఆస్తులన్నిటినీ తనఖా పెట్టి 'ఎమర్జెన్సీ' సినిమాను తెరకెక్కిస్తోంది. అంతేకాదు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో డెంగ్యూ జ్వరం వచ్చి తన రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోయిందని.. అయినా తాను సెట్లోకి వచ్చి పని చేసానని తెలిపారు కంగన. ఇది నాకు పునర్జన్మ...! అని కూడా వ్యాఖ్యానించడం చూస్తుంటే ఈ సన్నివేశంలో సీరియస్ నెస్ ని అర్థం చేసుకోవాలి.
ఎమర్జెన్సీ టాకీ పూర్తి కాగానే సెట్స్ నుండి కొన్ని ఫోటోలను కంగన షేర్ చేసింది. ఈ సినిమా కోసం తన ఆస్తినంతటినీ తాకట్టు పెట్టాల్సి వచ్చిందని.. తొలి షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో డెంగ్యూతో బాధపడ్డానని వెల్లడించింది. ఎమర్జెన్సీలో కంగనా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. సెట్ నుండి మూడు ఫోటోలను క్వీన్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందిరా గాంధీ ఆహార్యం లుక్ తో మేకప్ అచ్చు గుద్దినట్టు కుదిరిందని ఈ ఫోటోలు చెబుతున్నాయి. తాను కెమెరా వెనుక కూర్చొని దివంగత ఇందిరా గాంధీ స్టైల్లో మైక్రోఫోన్ లో మాట్లాడుతూ కనిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని .. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో తనకు డెంగ్యూ వచ్చిందని కంగన ఈ సందర్భంగా వెల్లడించింది. తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు తాను 'సురక్షిత స్థానం'లో ఉన్నానని.. తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తన అభిమానులకు తెలిపింది.
తన అనుభవాలతో సుదీర్ఘ నోట్ ని ఇన్ స్టాలో రాసింది. నేటితో నటిగా 'ఎమర్జెన్సీ'ని ముగించాను. నా జీవితంలో ఒక మహత్తరమైన ఘట్టం పూర్తయింది... నేను హాయిగా ప్రయాణించినట్లు అనిపించవచ్చు.. కానీ నిజం దానికి దూరంగా ఉంది... నా ఆస్తులన్నింటినీ తనఖా పెట్టడం నుండి నేను మొదటి షెడ్యూల్ లో డెంగ్యూతో బాధపడిన పరిస్థితిలో రక్త కణాల సంఖ్య భయంకరంగా తక్కువగా ఉన్నప్పటికీ షూటింగుకి వెనకాడలేదు. ఒక వ్యక్తిగా తీవ్రంగా పరీక్షకు గురయ్యాను. సోషల్ మీడియా పై నా భావాలను నేను చాలా ఓపెన్ గా చెప్పాను. కానీ నేను ఇవన్నీ అక్కడ వెల్లడించలేదు. ఎందుకంటే ఎవరూ అనవసరంగా నా గురించి చింతించాల్సిన అవసరం లేదు..'' అని కంగన సుదీర్ఘ నోట్ లో పేర్కొంది.
ఎమర్జెన్సీకి దర్శకత్వం వహిస్తున్న కంగన ఇంకా చాలా ఉద్విగ్న క్షణాల ను అనుభవాలను అభిమానులకు షేర్ చేసారు. ''మన కలల కోసం లేదా మీకు కావలసిన దాని కోసం కష్టపడితే సరిపోతుందని నమ్మితే.. అది నిజం కాదు కాబట్టి మళ్లీ మళ్లీ పదే పదే ఆలోచించండి… మీరు యోగ్యులైనా కానీ పరిమితికి మించి పరీక్షకు గురవుతారు. మీరు నాశనం కాకూడదు.. మీకు సాధ్యమయ్యేంత వరకూ ఓర్పుగా నిలబడండి.. జీవితం మిమ్మల్ని విడిచిపెడితే మీరు అదృష్టవంతులు.. కానీ అలా జరగదు! ముక్కలైన హృదయంతో పునర్జన్మ పొందే సమయం ఇది... ఇది నాకు పునర్జన్మ .. నేను మునుపెన్నడూ లేనంతగా సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నాను. నా కోసం పని చేసిన అద్భుతమైన ప్రతిభావంతులైన నా బృందానికి ధన్యవాదాలు'' అని నోట్ లో కంగన ఎమోషనల్ అయ్యారు.
కంగనా తన సినిమా ఎమర్జెన్సీని 2021లో ప్రకటించింది. దీనికి రితేష్ షా రచయిత. కంగనా చివరి చిత్రం 'ధాకడ్'కు ఆయనే రచయిత. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఎమర్జెన్సీ చిత్రంలో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్- మిలింద్ సోమన్- మహిమా చౌదరి- సతీష్ కౌశిక్ - శ్రేయాస్ తల్పాడే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది జూన్ లో ఎమర్జెన్సీ షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవలే చిత్ర బృందం అస్సాంలో టాకీ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తదుపరి కంగన నిర్మాణానంతర పనులపై దృష్టి సారించనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.