Begin typing your search above and press return to search.
బాత్రూమ్ ను మర్చిపోవాలన్న రెహమాన్
By: Tupaki Desk | 12 Sep 2017 11:30 PM GMTతన మ్యూజిక్ తో ఎంతటి కఠినాత్ముల హృదయాలనైనా కట్టిపడేసే సంగీత దర్శకుడు ఏ.అర్ రెహమాన్. చిన్న వయసులోనే కీబోర్డ్ ప్లేయర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి దేశాన్ని మెప్పించాడు. ఆ తర్వాత ప్రపంచాన్నే మెప్పించాడు. ఆయన స్వర పరచిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఆస్కార్ అవార్డు కూడా తన పాట ముందు లొంగిపోయేలా చేశాడు రెహమాన్. ఇన్నేళ్ల కెరీర్ లో మ్యూజిక్ తప్ప ఇతర కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.
రెహమాన్.. కోటి -ఇళయరాజా దగ్గర పనిచేసిన వారే. ఇంకా ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా చాలా దగ్గరి అనుబంధం ఉంది. అసలు విషయంలోకి వెళితే.. తొలిసారి తన కాన్సర్ట్ టూర్లతో ఓ చిన్న డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. అయితే దాని గురించి రెహమాన్ ఓ వెరైటీ కామెంట్ చేశాడు. అయన ఏమన్నారంటే "ఇప్పటికే నా వయసు 50 దాటింది. ఇక నుంచి సరికొత్త కమర్షియల్ సినిమాలకి మ్యూజిక్ చేయాలనీ ఉంది. ఆ మ్యూజిక్ కూడా ఎలా ఉండాలి అంటే.. ఆడియెన్స్ పాట వచ్చినప్పుడు బాత్ రూమ్ కి కూడా వెళ్ళకూడదు. అలాగే హల్ నుంచి బయటకి వెళ్లి పాప్ కార్న్ కూడా తెచ్చుకోకూడదు" అని కామెంట్ చేశాడు రెహమాన్. పాటల ఒడిలో ఊయల ఊపుతాననే విధంగా రెహమాన్ కామెంట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ 151వ సినిమా "సైరా" కోసం బాణీలను రెడీ చేస్తున్నాడు. అలాగే రజినీకాంత్ 2.ఓ సినిమాతో పాటు మరికొన్ని హిందీ చిత్రాలకు కూడా బాణీలను అందిస్తున్నాడు. అది సంగతి.