Begin typing your search above and press return to search.

అరుదైన క‌ల‌యిక సెట్ చేశారు.. కానీ అస‌లు విష‌యం..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 6:35 AM GMT
అరుదైన క‌ల‌యిక సెట్ చేశారు.. కానీ అస‌లు విష‌యం..!
X
భార‌తీయ సినిమాలో క‌రోనా త‌రువాత విప్ల‌వాత్బ‌మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంతో పోలిస్తే క‌రోనా త‌రువాత సినిమా కష్ట‌మ‌నే కామెంట్ లు వినించాయి. కానీ ఆ వాద‌న‌కు పూర్తి భిన్నంగా క‌రోనా త‌రువాత సినిమా ప‌రిస్థితులు మ‌రింత మెరుగ‌య్యాయి. మునుపెన్న‌డూ లేని విధంగా ద‌క్షిణాది సినిమా జేజేలు అందుకుంటూ ఇండియ‌న్ సినిమాకు దిశ నిర్ధేశం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాది సినిమాకు దేశ వ్యాప్తంగా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో అంద‌రి దృష్టి ఇప్పుడు ద‌క్షిణాది స్టార్స్ పై ప‌డింది.

దీంతో ప్ర‌ముఖ వెబ్ మ్యాగ‌జైన్ ఫిల్మ్ కంపానియ‌న్ ద‌క్షిణాది సినిమాకు వ‌న్నె తెస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నఆరుగురు మ‌ల్టీటాలెంటెడ్ సెలెబ్రిటీల‌తో ప్ర‌త్యేకంగా ఫిల్మ్ మేక‌ర్స్ అడ్డా 2022 పేరుతో ఓ రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో టాలీవుడ్ నుంచి రాజ‌మౌళి, స్వ‌ప్న ద‌త్ పాల్గొన‌గా, కోలీవుడ్ నుంచి క‌మ‌ల్ హాస‌న్‌,లోకేష్ క‌న‌గ‌రాజ్‌, గౌత‌మ్ మీన‌న్, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి పృథ్వీరాజ్ సుకుమార‌న్ హాజ‌ర‌య్యారు. ఈ రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ప్ర‌తీ సభ్యుడు త‌న అభిప్రాయాల‌ని తెలియ‌జేశాలి.

అందులో భాగంగానే ఫిలిం కంపానియ‌న్ ఫిలిం మేక‌ర్స్ అడ్డా పేరుతో రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక్క‌డో విష‌యం ఏంటంటే క‌న్న‌డ నుంచి మాత్రం ఇందులో ఎవ‌రూ పాల్గొన‌లేదు. రిష‌బ్ శెట్టిని పిలిస్తే బాగుండేదే కామెంట్ లు వినిపిస్తున్నాయి. పిలిచినా కానీ ఈ బ్యాచ్ తో త‌న‌ని క‌ల‌ప‌కుండా వేరే బ్యాచ్ తో క‌లప‌డంతో అనుకున్న‌ది జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా తెలుగు సినిమాకే కాకుండా ద‌క్షిణాది సినిమ‌ని ఓ రేంజ్ లో పోట్రేట్ చేయ‌డంతో అత‌నికి దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఏర్ప‌డింది.

అంత‌ర్జాత‌య స్థాయిలోనూ ద‌ర్శ‌కుడిగా గుర్తింపుని సొంతం చేసుకున్నాడు, ఇక క‌మ‌ల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌ను ద‌ర్శ‌కుడిగా,హీరోగా ఎలాంటి ప్ర‌యోగాలు చేశాడో అంద‌రికి తెలిసిందే. ఇర‌వై ఏళ్ల క్రిత‌మే అడ్వాన్స్డ్ మూవీస్ ని అందించి క‌మ‌ల్బ్బుర ప‌రిచారు. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై త‌న‌దైన మార్కు సినిమాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించారు. అయితే వీరితో పాటు న్యూ జ‌న‌రేష‌న్ మేక‌ర్స్ నుంచి ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ మొద‌లు పెట్టాల‌ని, ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని బ‌య‌టికి తీసుకురావాల‌ని ఫిలిం కంపానియ‌న్ చేసిన ప్ర‌య‌త్నం నెర‌వేర‌లేదు.

కార‌ణం ఈ రౌండ్ టేబుల్ స‌మావేశంలో క‌మ‌ల్ గురించి, రాజ‌మౌళి గురించి ఎప్పుడో విడుద‌లైన 'షోలే', శాంతారాంల గురించి త‌ప్ప మరో టాపిక్ ని ట‌చ్ చేయ‌క‌పోవ‌డం.. మిగ‌లిన వాళ్లు ఆడియ‌న్స్ గా మారి వారు చెప్పేది వింటూ త‌లూప‌డంతో ప్రోగ్రామ్ ప్ర‌ధాన ఉద్దేశం దారి త‌ప్పింది. దీంతో ఫిలిం కంపానియ‌న్ వారు అనుకున్న దొక‌టి అక్క‌డ జ‌రిగింది మ‌రొక‌టి అన్న‌ట్టుగా రౌండ్ టేబుల్ స‌మావేశం అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.