Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు దక్కిన అరుదైన గౌరవం!
By: Tupaki Desk | 1 Nov 2022 1:30 PM GMTస్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. టాలీఉవడ్ ఓ లవున్న టాప్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ శైలి ప్రత్యేకం అన్నది అందరికి తెలిసిందే. రాజమౌళి 'RRR' తో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పాపులర్ కావడంతో హాలీవుడ్ స్టార్స్ లోనూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
మంగళవారం నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సెలబ్రేషన్స్ ని నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నాడు. ఇందు కోసం తనకు ప్రత్యేకంగా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానాన్ని పింపించడం విశేషం. ఇదే సందర్భంగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ప్రతిష్టాత్మకంగా భావించే కర్ణాటక రత్న బిరుదుని ప్రకటించి ఆ పుస్కారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేయబోతోంది.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సామాజిక వేత్త సుధామూర్తి తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చురుకున్నారు.
ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఎన్టీఆర్ ఫొటోలని తాజాగా ఆయన పీఆర్ టీమ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా వుంటే కర్ణాటకలోని ప్రధాన పత్రికల్లో ఫార్మేషన్ డే సందర్భంగా జరిగే సెలబ్రేషన్స్ కి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది.
ఇందులో ఎన్టీఆర్ ఫొటోని కూడా ప్రచురించడంతో ఆయన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఫొటోని ప్రముఖంగా ప్రచురించగా విశిష్ట అతిధుల కేటగిరీలో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సామాజిక వేత్త సుధామూర్తి తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల ఫొటోలని కూడా ప్రచురించడం విశేషం. ఇది మన పొరుగు రాష్ట్రంలో టాలీవుడ్ స్టార్ హీరో హోదాలో ఎన్టీఆర్ కు దక్కిన అరుదైన గౌరవంగా చెబుతున్నారు.
కన్నడ స్టార్లతో పాటు కన్నడ భాషతోనూ ఎన్టీఆర్ కు మంచి అనుబంధం వున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తల్లి శాలినీ భాస్కర్ రావు కర్ణాటక లోని కుందాపూర్ కు చెందిన వారు. అంతే కాకుండా పునీత్ రాజ్ కుమార్ నటించిన 'చక్రవ్యూహ' సినిమా కోసం తొలిసారి కన్నడలో ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడి ఆశ్చర్యపరిచారు. అంతే కాకుండా పునీత్ తో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం వుండేది. ఇంతగా కన్నడపై మమకారం పెంచుకున్న ఎన్టీఆర్ కు కన్నడ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.